దిగజారకూడదు
సనాతన శక్తులు
తమిళసినిమా: నవరస కలైకూట్టం పతాకంపై క్రిస్తుదాస్, మోబు సరవణన్, ప్యూలా క్రిస్తుదాస్ కలిసి నిర్మించిన చిత్రం నెంజు పొరుక్కుదిల్‌లైయే. ఈ చిత్రానికి ప్లాస్సో రాయ్‌స్టన్, కవి దినేష్‌కుమార్ ద్వయం కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. అన్బేవా, పావం గణేశన్, చిల్లన్ను ఒరు కాదల్ వంటి టీవీ.సీరియళ్లలో నటించిన అరవింద్ రియో, కాళిదాస్ హీరోలుగా నటించిన ఇందులో కనా కానుమ్ కాలంగళ్ సీరియల్ ఫేమ్ భువనేశ్వరి రమేశ్‌బాబు, సూర్యవంశం, ఎన్డ్రెడుం పున్నగై, ఎంగవీటు మీనాక్షి మొదలగు సీరియళ్ల ఫేమ్ నిత్యారాజ్ ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. జెసన్ కౌశీ, శశికుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా నిర్మాత కింగ్‌మేకర్ క్రిస్తుదాస్ ప్రతినాయకుడిగా పరిచయం అయ్యారు. ఎం ఎస్. సుదర్శన్ సంగీతాన్ని, విజయకుమార్ నేపథ్య సంగీతాన్ని, అబ్దుల్ కె. రఘుమాన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయత్రం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరుతైగళ్ కట్చి అధ్యక్షుడు తోల్ తిరుమావళవన్ మాట్లాడుతూ ఈ చిత్ర టైటిల్‌ను నిర్ణయించినప్పుడే దర్శక నిర్మాతలకు సామాజిక బాధ్యత ఉందన్నది అర్థం అవుతుందన్నారు. మహాకవి భారతీ పాడిన పాటలో ముఖ్యమైన పదం నెంజు పొరుక్కుదిలైయే అని పేర్కొన్నారు. దాన్ని చిత్రానికి పేరుగా నిర్ణయించిన ఈ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అన్నారు. చిత్రాన్ని సోషియల్ మెసేజ్ ఉండేలా రూపొందించాలని నిర్మాత భావించారన్నారు. ఈ తరం సమాజంలో మంచి మార్పులు రావాలన్న బాధ్యతను కలిగిఉండటం సంతోషకరం అన్నారు. ప్రేమ అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంశం అన్నారు. ఇది ఇంకా వేలాది చిత్రాలకు మూలం అవుతుందన్నారు. సనాతన ఽశక్తులు దిగజారకూడదన్నారు. ఆలోచనాపరులు సినిమారంగంలోకి రావాలన్నారు. అలాంటి చిత్రాన్ని రూపొందించిన ఈ యూనిట్‌కు శుభాభినందనలు తెలిపారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని తోల్ తిరుమావళవన్ ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment