డ్రైవర్ రహిత మెట్రో ట్రయల్ రన్
సాక్షి, చైన్నె: డ్రైవర్ రహిత మెట్రో రైలు ట్రయల్ రన్‌పై అధికారులు దృష్టి పెట్టారు. నిపుణులు రంగంలోకి దిగడంతో వారి పరిశీలన మధ్య పూందమల్లి యార్డ్‌లో ట్రయల్ రన్‌పై దృష్టి పెట్టారు. చైన్నెలో తొలి దశ మెట్రో పనులు ముగించి రైలు సేవలు సాగుతున్న విషయం తెలిసిందే. రోజుకు మూడు లక్షల మందికిపైగా ఈరైలు సేవలను ఉపయోగిస్తున్నారు. దీంతో మెట్రో దశలో మరో మూడు మార్గాలను ఎంపిక చేసిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో పూందమల్లి – లైట్ హౌస్, మాధవరం – షోళింగనల్లూరు, మాధవరం – సిరుచ్చేరి మార్గాలు ఉన్నాయి. ఈ రెండో దశలో డ్రైవర్ రహిత మెట్రో రైలు నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. శ్రీసిటీలో ఈ రైలు రూపుదిద్దుకుంతోంది. ప్రస్తుతం ఓ రైలు రూపుదిద్దుకుంది. దీనిని పూందమల్లిలోని మెట్రో రైలుయార్డ్‌లో ఉంచారు. ఇక్కడ ఈ రైలు ట్రయల్ రన్ మీద అధికారులు దృష్టి పెట్టారు. ఈ యార్డ్‌లోనే కొంత దూరం మేరకు రైలు ఆటోమేటిక్ సేవగా కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు పర్యవేక్షిస్తూ ముందుకు నడిపే పనిలో నిమగ్నమయ్యారు. ప్రత్యేక నిపుణుల కమిటీ సైతం రంగంలోకి దిగడంతో ట్రయల్ రన్ వేగం పెరిగింది. జనవరిలో ఈ మెట్రో రైలును పూందమల్లి–లైట్‌హౌస్ మార్గంలో కొంత దూరం నడిపేందుకు తగినట్టుగా మెట్రో వర్గాలు కార్యాచరణలో ఉన్నాయి. దీంతో త్వరితగతిన యార్డ్‌లో అన్ని రకాల పరిశీలనను నిపుణుల కమిటీ పూర్తిచేసి నివేదిక ఇవ్వగానే మెయిన్ లైన్‌లోకి ఎక్కించి ట్రయల్ రన్ పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా, చైన్నెలో జరుగుతున్న మెట్రో పనుల కారణంగా గత మూడేళ్లలో వాహనదారుల మీద అదనపు భారం పడినట్టు ఓ పరిశీలనలో తేలింది. 100కుపైగా ప్రాంతాలలో, 48 ముఖ్య కూడళ్ల గుండా ఈ పనులు జరుగుతున్నాయి. దీంతో వాహ నాలకు టేక్ డైవర్షన్లు తప్పడం లేదు. సాధారణంగా వెళ్లే మార్గాలలో కాకుండా, అదనంగా చుట్టుకుంటూ వెళ్లాల్సి రావడంతో వాహనదారులకు గత మూడేళ్లలో రూ.1,696 కోట్లమేరకు నష్టం కలిగినట్టు ఈ పరిశీలనలో తేలింది. అలాగే, ఈ పనుల కారణంగా ద్విచక్ర వాహనదారులు అధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తేలింది. బ్యాక్ పెయిన్‌తో పాటు శ్వాస సమస్యను ఎదుర్కొంటున్నట్టు వెలుగుచూసింది.
మెట్రో రైలు
Comments
Please login to add a commentAdd a comment