చైన్నెలో కొత్త రిజర్వాయర్లు
● నివేదికకు నీటి పారుదల శాఖ కసరత్తు
సాక్షి, చైన్నె: చైన్నెలో భవిష్యత్తు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త రిజర్వాయర్లపై నీటి పారుదల శాఖ దృష్టి పెట్టింది. చైన్నె మెట్రో వాటర్ బోర్డు ను సమగ్ర పరిశీలన ద్వారా నివేదిక కోరినట్టు సంకేతాలు వెలువడ్డాయి. చైన్నెకు రోజుకు 1100 మిలియన్ లీటర్ల నీరు అవసరం అనే విషయం తెలిసిందే. చెంబరంబాక్కం, పుళల్, పూండి, చోళవరం, తేర్వాయి కండ్రిగ రిజర్వాయర్ల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే సముద్రపు నీటిని తాగునీరుగా మార్చి అందజేస్తున్నారు. ప్రస్తుతం 24 టీఎంసీల నీరు చైన్నెకు నిల్వ ఉంచే రీతిలో రిజర్వాయర్లు ఉన్నాయి. అయితే 2035 నాటికి 35 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే దిశగా కొత్త రిజర్వాయర్ల మీద నీటి పారుదల శాఖ దృష్టి కేంద్రీకరించింది. చైన్నె శివార్లలో అతి పెద్ద చెరువులుగా ఉన్న ఆదనూరు, సోమంగళం, మణి మంగళం పలు చెరువులను రిజర్వాయర్లుగా మార్చే దిశగా కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికకు చైన్నె మెట్రో వాటర్ బోర్డును నీటి పారుదల శాఖ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment