డీమాంటీ కాలనీ –3కి సన్నాహాలు
తమిళసినిమా: సక్సెస్ అయిన హార్రర్ కథా చిత్రాలలో డీమాంటీ కాలనీ చిత్రం పేరు కచ్చితంగా ఉంటుంది. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు 2015లో తెరకెక్కించిన చిత్రం ఇది. నటుడు అరుళ్ నిధి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం అప్పట్లో అనూహ్య విజయాన్ని సాధించి ట్రెండ్ సెట్టర్‌గా మారింది. కాగా ఆ చిత్రానికి సీక్వెల్ ను రూపొందించారు. ఇందులో నటుడు అరుళ్ నిధి. ప్రియ భవానీ శంకర్ జంటగా నటించారు. 2024 లో విడుదలైన ఈ చిత్రం కూడా సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్ర ఎండింగ్‌లో పార్ట్ –3 ఉంటుందని లీడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు డీమాంటీ కాలనీ –3ని తెరకెక్కిండానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా తెలిపారు. ఈ చిత్ర షూటింగ్‌ను జపాన్ తదితర పలు విదేశాల్లో నిర్వహించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా దీన్ని ఫ్యాషన్ స్టూడియోస్, గోల్డ్ మైన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నట్లు తాజా సమాచారం. లేకపోతే డీమాంటి కాలనీ –2 చిత్రంలో నటించిన నటుడు అరుళ్ నిధి, నటి ప్రియా భవానీ శంకర్ చాలా బాగా నటించారని ప్రశంసలు పొందారు. కాగా డీమాంటీ కాలనీ –3 చిత్రంలోని మళ్లీ ఈ జంటే నటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. డీమాంటి కాలనీ 1,2 చిత్రాల కంటే 3 చిత్రం మరింత భారీ బడ్జెట్లో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందనుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment