ఇకపై విజయకాంత్ పేరిట అవార్డులు
● ఇండియన్ అవార్డుల వేడుకలో జాన్ అమలన్ ప్రకటన
సాక్షి,చైన్నె: సినీ నటుడు, రాజకీయ నాయకుడు దివంగత విజయకాంత్ పేరిట ఏటా అవార్డులను అందించనున్నామని ఇండియన్ మీడియా వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ జాన్ అమలన్ ప్రకటించారు. చైన్నె వేదికగా ఇండియన్ మీడియా వర్క్స్ ఆధ్వర్యంలో సినిమా, టెలివిజన్, రాజకీయాలు, సామాజిక సేవ తదితర రంగాలలో స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలిచిన వారికి ఇండియన్ అవార్డ్స్ –2024ను ప్రదానం బుధవారం జరిగింది. ఇందులో తమిళనాడు పాలిటిక్స్ అవార్డును రాష్ట్ర మంత్రి మదివేందన్‌కు అందజేయగా, దివంగత నటుడు విజయకాంత్‌కు భారతీయ సినిమాలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అవార్డును ఆయన తరపున సతీమణి ప్రేమలత విజయకాంత్ అందుకున్నారు. అలాగే డిఫెన్స్ సెక్టార్‌లో ఉత్తమ సేవలను అందించిన ఫ్రైడ్ ఆఫ్ తమిళనాడు అవార్డును ఐడీఏఎస్–డిఫెన్స్ అకౌంట్స్( రక్షణ మంత్రిత్వ శాఖ) కంట్రోలర్ జయశీలన్‌కు, ఐకాన్ ఆఫ్ సోషల్ లిబరేషన్‌గా వీసీకే నేత, ఎంపీ తోల్ తిరుమావళవన్‌కు అందజేశారు. ఈ సందర్బంగా జాన్ అమలన్ మాట్లాడుతూ విజయవంతంగా ఇండియన్ అవార్డ్స్ –2024 ప్రదానం చేశామని, రానున్న సంవత్సరాలలో ఇక ఏటా కెప్టెన్ విజయకాంత్ పేరిట అవార్డును అందించనున్నామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment