పుదుచ్చేరి వాసులకు రూ.750 కానుక
సాక్షి, చైన్నె: సంక్రాంతి సందర్భంగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని కుటుంబ కార్డుదారులకు (రేషన్ కార్డులు) రూ.750 సంక్రాంతి కానుకను సీఎం రంగస్వామి ప్రకటించారు. తమిళనాడులో రేషన్‌కార్డుదారులకు కేవలం ఒక కేజీ పచ్చిబియ్యం, ఒక కేజీ చక్కెర, ఒక చెరకు గడ ఇవ్వడానికి సీఎం స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. నగదు కానుకను పరిశీలించలేదు. ఈ పరిస్థితిలో పుదుచ్చేరి ప్రభుత్వం తమ రాష్ట్రంలోని కుటుంబ కార్డుదారులకు రూ.750 ప్రకటించింది.
దేశ ఆర్థికాభివృద్ధికి
ఐసీఎస్‌ఐ తోడ్పాటు
● అన్నామలై వ్యాఖ్య
సాక్షి, చైన్నె: దేశ ఆర్థికాభివృద్ధికి ఐసీఎస్‌ఐ తోడ్పాటు కీలక పాత్ర పోషిస్తున్నట్టు మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై వ్యాఖ్యానించారు. ది ఇన్‌ిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో చైన్నె వేదికగా జాతీయ స్థాయిలో టాక్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై, ఇన్‌కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ డి.సుధాకర్‌రావు హాజరయ్యారు. కార్పొరేట్ గవర్నెన్స్, రెగ్యులేటరీలకు కంపెనీ సెక్రటరీల సహకారం, ఆడిటింగ్, పన్నులు ఇతర అంశాల గురించి చర్చించారు. అన్నామలై మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధికి పెరుగుతున్న కంపెనీల సంఖ్యతో పాటుగ అందుకు తగ్గ కంపెనీ సెక్రటరీల అవశ్యం ఉందని పేర్కొన్నారు. కంపెనీ సెక్రటరీలు, వారి నైతికతతో, దేశంలో కార్పొరేట్ గవర్నెన్స్ అభిప్రాయ రూపకర్తలు, సంరక్షకులుగా ఉన్నారని వివరించారు. ఐసీఎస్‌ఐ కౌన్సిల్ సభ్యుడు ఈ.మోహన్‌కుమార్ పాల్గొన్నారు.
ప్రేమజంట ఆత్మహత్య
సేలం: ప్రేమకు తల్లిదండ్రులు వ్యతిరేకత తెలపడంతో ప్రేమజంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉసిలంపట్టిలో చోటుచేసుకుంది. మదురై జిల్లా ఉసిలంపట్టి సమీపంలో ఉలైపట్టి గ్రామానికి చెందిన పాండియన్ కుమారుడు జయసూర్య (22). పట్టభద్రుడైన ఇతను అదే గ్రామంలో పండ్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మురుగన్ కుమార్తె పాండీశ్వరి (18). ఈమె మదురైలోని ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. జయసూర్య, పాండీశ్వరి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం పాండీశ్వరి తల్లిదండ్రులకు తెలిసి వారు తీవ్రంగా వ్యతిరేకించారు. పాండీశ్వరిని మేనమామకు ఇచ్చి వివాహం చేయడానికి ఏర్పాటు చేశారు. ఈ స్థితిలో పాండీశ్వరి, జయసూర్య దుకాణంలో గురువారం రాత్రి విషం తాగి స్పృహతప్పి పడిపోయారు. గమనించిన ఇరుగుపొరుగు వారిని ఉసిలంపట్టి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించగా, అప్పటికే ఇద్దరు మృతి చెందినట్టు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రైల్వే ఆస్పత్రుల్లో
అధునాతన సౌకర్యాలు
సాక్షి, చైన్నె: రైల్వే ఆస్పత్రులలో అధునాత వైద్య సౌకర్యాలను విస్తృతం చేశామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ రైల్వే హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మాన్‌సింగ్ తెలిపారు. చైన్నె పెరంబూర్‌లోని న్యూ సదరన్ రైల్వే హాస్పిటల్ కాంప్లెక్స్‌లో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్, ఐసీయూ కాంప్లెక్స్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి సదరన్ రైల్వే జీఎం ఆర్‌ఎన్ సింగ్, ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రన్, రైల్వేబోర్డ్ అధికారులు, డాక్టర్లు సీఎం రవి, డాక్టర్ కల్యాణి సాయి దండపాణి, ఓ మౌర్య, చైన్నె డివిజన్‌న్ డీఆర్‌ఎం బి.విశ్వనాథ్ ఈర్యా, పెరంబూర్‌లోని రైల్వే హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వి.కన్నన్ హాజరయ్యారు. మాన్‌సింగ్ మాట్లాడుతూ ఇక్కడి ఆస్పత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలను వివరించారు. కార్పోరేట్ హెల్త్‌కేర్ ప్రమాణాలకు దీటుగా రోబోటిక్ సర్జరీని ప్రవేశపెట్టే సామర్థ్యం గురించి కూడా తెలియజేశారు. దక్షిణ రైల్వే జీఎం ఆర్‌ఎన్ సింగ్ మాట్లాడుతూ, రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబాలు, నాన్–రైల్వే పేషెంట్ల ప్రయోజనాల కోసం చెల్లింపు ప్రాతిపదికన ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల గురించి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment