ముగిసిన సిగరం యూత్ ఫెస్ట్
సాక్షి, చైన్నె: ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో విజయవంతంగా సిగరం యూత్ ఫెస్ట్ వేడుకలు ముగిశాయి. కాటాన్ కొళత్తూరులోని ఆ విద్యా సంస్థ ఆవరణలో 38వ అంతర్ వర్సిటీ యూత్ ఫెస్టివల్ గత వారం రోజులుగా జరిగింది. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ శతాబ్ది ఉత్సవంలో భాగంగా ఈ వేడకను సిగరం యూత్ ఫెస్ట్‌గా నిర్వహించారు. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఈ వేడుకలో తమ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. ఐదు రోజుల పాటు కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఆ వర్సిటీ చాన్స్‌లర్ టీఆర్ పారివేందర్, వీసీ ముత్తమిళ్ సెల్వన్, ఏఐయూ అదనపు కార్యదర్శి మమతా అగర్వాల్, ఐఆర్‌ఎస్ అధకారి రమేష్‌కుమార్ విజేతలకు బహుమతులను అందజేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళకు చెందిన 21కి పైగా వర్సిటీల నుంచి విద్యార్థులు తరలి వచ్చారు. ఎస్‌ఆర్‌ఎం ఐఎస్‌టీ డైరెక్టర్ డాక్టర్ నిషా అశోకన్ పర్యవేక్షణలో విద్యార్థులు 27 పోటీల్లో పాల్గొన్నారు. 23 మంది ప్రముఖ జ్యూరీ సభ్యుల ప్యానెల్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఈ ఫెస్ట్‌లో కేరళ వర్సిటీ ఓవరాల్ చాంపియన్‌గా ట్రోఫీని దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment