దురైమురుగన్ ఇంట్లో ఈడీ సోదాలు
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడిలోని గాంధీనగర్‌లో డీఎంకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మంత్రి దురైమురుగన్‌తో పాటు ఆయన కుమారుడు వేలూరు పార్లమెంట్ సభ్యులు కదిర్‌ఆనంద్ ఇల్లు ఉంది. వీటితోపాటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని క్రిష్టియన్ పేటలో వీరికి సొంతమైన ఇంజినీరింగ్ కళాశాల, పాఠశాల నడుస్తున్నాయి. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ఈడీ అధికారులు దురైమురుగన్‌కు చెందిన కళాశాల, ఇంటి వద్దకు చేరుకున్నారు. అనంతరం ఇంటి గేట్లు మూసివేసి పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దురైమురుగన్‌కు ప్రధాన అనుచరుడు డీఎంకే పార్టీ కార్యకర్త పూంజోలై శ్రీనివాసన్. ఇతను కాట్పాడి సమీపంలోని పల్లికుప్పంలో ఉంటున్నారు. దీంతో ఇతని ఇంట్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఇతని బంధువుకు సొంతమైన సిమెంట్ గోడౌన్‌తో పాటు మంత్రి అనుచరుల ఇల్లు మొత్తం నాలుగు చోట్ల ఒకేసారి సోదాలు చేశారు. విషయం తెలిసి డీఎంకే కార్యకర్తలు మంత్రి దురైమురుగన్ ఇంటి వద్దకు చేరుకున్నారు. సోదాల్లో ఈడీ పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా దురైమురుగన్ కుమారుడు కదిర్ ఆనంద్ 2019వ సంవత్సరంలో వేలూరు ఎంపీగా పోటీ చేశారు. ఆసమయంలో దురైమురుగన్ ఇల్లు, అతని అనుచరుల ఇళ్లలో గోనె సంచిలో దాచి ఉంచిన రూ.11.51 కోట్ల నగదు పట్టుబడింది. సోదాలపై దురైమురుగన్ వద్ద చైన్నెలోని విలేకరులు ప్రశ్నించగా తనిఖీల గురించి తనకు ఏమీ తెలియదని తెలిపి రాష్ట్ర సచివాలయానికి వెళ్లినట్లు తెలిసింది.
అనుచరుల ఇంట్లోనూ తనిఖీలు
కాట్పాడిలో పటిష్ట పోలీస్ బందోబస్తు
Comments
Please login to add a commentAdd a comment