11.50 కిలోల బంగారం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

11.50 కిలోల బంగారం స్వాధీనం

Published Mon, Jan 6 2025 8:25 AM | Last Updated on Mon, Jan 6 2025 8:25 AM

11.50

11.50 కిలోల బంగారం స్వాధీనం

రూ. 8 కోట్లు విలువ చేస్తుందని అంచనా

తిరువొత్తియూరు: రామేశ్వరానికి పడవ ద్వారా తరలించుటకు యత్నించిన 11.50 కిలోల బంగారాన్ని శ్రీలంక నావికాదళ పోలీసులు స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. వివరాలు.. రామేశ్వరం ధనుష్కోటి సముద్రం మార్గం ద్వారా శ్రీలంకకు బీడీ ఆకులు, పసుపు, ఏలక్కాయలు, గంజాయి, సముద్రపు జలగలు తదితర వస్తువు లు. పెయిన్‌ కిల్లర్‌ మాత్రలు తదితరాలను తర చూ తరలిస్తుంటారు. ఇలాగే శ్రీలంక నుంచి రామే శ్వరానికి బంగారు కడ్డీలను తరలించడం జరుగుతోంది. ఈక్రమంలో శ్రీలంక కల్పట్టి సముద్ర ప్రాంతం నుంచి శ్రీలంక నావికాదళం వారు రెండు గస్తీ పడవలలో శనివారం గస్తీ కాస్తుండగా.. ఆ సమయంలో శ్రీలంక రిజిస్టర్‌ నెంబర్‌ కలిగిన ఫైబ ర్‌ పడవలో సందేహస్పదంగా ఇద్దరు ఉన్నారు. వెంటనే శ్రీలంక నావిక దళ పోలీసులు ఆ ఫైబర్‌ పడవను అడ్డుకొని తనిఖీ చేశారు. అందులో ప్లాస్టిక్‌ ఫైబర్‌ పడవలో ఎక్కువ మొత్తంలో బంగారు కడ్డీలు తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో బంగారు కడ్డీలను, పడవను స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నావిక దళ పోలీసులు ఫైబర్‌ పడవలో ఉన్న ముగ్గురుని అరెస్టు చేశారు. విచారణలో వారు బంగారు కడ్డీలను శ్రీలంక కాల్‌ పట్టి ప్రాంతం నుంచి రామేశ్వరం, ధనుష్కోటి మార్గం ద్వారా తమిళనాడుకు తరలిస్తున్నట్లు తెలియ వచ్చింది. దీంతో ముగ్గురిని శ్రీలంక నాయక దళం వారు విచారణ చేస్తున్నారు. మొత్తం 11.50 కిలోల బంగారం కడ్డీలను శ్రీలంక నావికాదళం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు కడ్డీలు విలువ రూ.8 కోట్లు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

కనిమొళికి స్టాలిన్‌ ఆశీస్సులు

సాక్షి, చైన్నె : తన సోదరి, పార్టీ ఎంపీ కనిమొళికి సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ తన ఆశీస్సులు అందించారు. ఆదివారం తన బర్త్‌డేను పురస్కరించుకుని కనిమొళి ఉదయాన్నే మెరీనా తీరంలోని తన తండ్రి, పార్టీ దివంగతనేత కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పించారు. పక్కనే ఉన్న అన్నాసమాధి వద్ద అంజలి ఘటించి నేరుగా సీఎం, తన సోదరుడు స్టాలిన్‌ నివాసంకు చేరుకున్నారు. ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా తన సోదరికి అభినందనలు, శుభాకాంక్షలతో ఆశీస్సులను స్టాలిన్‌ అందజేశారు. అనంతరం తన నివాసంకు కనిమొళి చేరుకోగా అక్కడ పార్టీ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. పార్టీ ముఖ్య నాయకులు పలువురితో పాటూ మహిళా విభాగం నేతలు తరలి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డీఎంకే మహిళా విభాగం పేరిట విడుదల చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో చేతి కర్రను చేతబట్టినట్టుగా, ఉదయ సూర్యుడి వెలుగు మధ్యలో కనిమొళి నిలబడినట్టుగా పేర్కొంటూ, ఓ పాటతో విడుదల చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

నటుడు ప్రభుకు శస్త్ర చికిత్స

తమిళసినిమా: ప్రముఖ నటుడు ప్రభుకు శస్త్ర చికిత్స జరిగింది. ప్రఖ్యాత దివంగత నటుడు శివాజీ గణేషన్‌ వారసుడు ప్రభు అన్న విషయం తెలిసిందే. ఈయన 1980 – 90 ప్రాంతంలో ప్రముఖ కథానాయకుడిగా రాణించారు. 200 పైగా చిత్రాలు నటించిన ప్రభు ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే అజిత్‌ కథానాయకుడిగా నటించిన గుడ్‌ బాడ్‌ అగ్లీ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించారు. కాగా ప్రభు గత ఏడాది ఫిబ్రవరి నెలలో మూత్రపిండాల సమస్య కారణంగా చైన్నెలోని ఒక ప్రముఖ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందారు. కాగా గత శుక్రవారం జ్వరం తలనొప్పి కారణంగా స్థానిక కోడంబాక్కమ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఆసుపత్రిలో ప్రభుకు వైద్య చికిత్సలు నిర్వహించిన వైద్యులు ఆయన మెదడులోని ప్రధాన భాగానికి రక్తప్రసరణ జరగడం లేదని గుర్తించారు. మెదడులోని ప్రధాన ధమని ఉబ్బినట్లుగా గుర్తించిన వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో ప్రభు ఆదివారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. నటుడు ప్రభు ఆరోగ్యం బాగుందని అయితే ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు.

ఫిర్యాదులు వస్తే తక్షణ విచారణ

కళాశాలలకు అన్నావర్సిటీ ఆదేశాలు

సాక్షి, చైన్నె: విద్యార్థినులు ఏదేని ఫిర్యాదులు చేసిన పక్షంలో తక్షనం విచారించి చర్యలు చేపట్టే విధంగా కళాశాలలకు అన్నావర్సిటీ ఆదేశాలు జా రీ చేసింది. అన్నావర్సిటీలో చోటుచేసుకున్న ఘట న రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన నిందితుడు జ్ఞాన శేఖర్‌ ఆస్పత్రిలో చికిత్సలో ఉండగా అతడిని సిట్‌ బృందం విచారించినట్లు సంకేతాలు వెలువడ్డాయి. అతడి ల్యాప్‌టాప్‌లో ఉన్న వీడియోలు, ఫొటోలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటన నేపథ్యంలో తమ పరిధిలోని ఇంజినీరింగ్‌ కళాశాలలకు అన్నావర్సిటీ కొన్ని నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో విద్యార్థినుల నుంచి ఏదేని ఫిర్యాదులు వచ్చిన పక్షంలో తక్షణం విచారించడం, అవసరమైతే పోలీసులను ఆశ్రయించడం చేయాలని ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
11.50 కిలోల                  బంగారం స్వాధీనం
1
1/1

11.50 కిలోల బంగారం స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement