ఎలుగుబంటి దాడిలో మాజీ సైనికుడి మృతి
అన్నానగర్: తేని జిల్లా, ఆండిపట్టి తాలూకా, కడమలైకుండు సమీపంలోని అన్నానగర్ ప్రాంతానికి చెందిన పెరుమాళ్(60) మాజీ సైనికుడు. ఇతని భార్య సరస్వతి. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నా రు. వారికి వివాహం జరిగి బయట ఊరిలో నివశిస్తున్నారు. కడమలైకుండు సమీపంలోని చితంబరం ప్రాంతంలో పెరుమాళ్‌కు మలయ దేవర్‌లో సొంత తోట ఇల్లు ఉంది. ప్రస్తుతం అతను తన భార్యతో కలిసి ఆ ఇంట్లో నివశిస్తున్నాడు. ఆదివారం రాత్రి, ఇంటికి కిరాణా సామాను కొనుగోలు చేసి బైకులో మట్టిరోడ్డుపై తన ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఒక ఎలుగుబంటి అకస్మాత్తుగా కొండ దిగువన ఉన్న మట్టి మార్గంలో వచ్చింది. ఇది చూసి పెరుమాళ్ దిగ్భ్రాంతి చెందాడు. ఒక్కసారిగా పెరుమాళ్‌పై ఎలుగుబంటి దాడి చేసి అడవిలోకి వెళ్లింది. ఇందులో తీవ్రంగా గాయపడిన పెరుమాళ్ రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పెరుమాళ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన పెరుమాళ్ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. తొలివిడతగా రూ.50 వేల చెక్కును ఆయన కుటుంబీకులకు ఆండిపట్టి ఎమ్మెల్యే మహారాజ, అధికారులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment