గ్రామాల్లో అభివృద్ధి పనుల పరిశీలన
తిరువళ్లూరు: గ్రామాల్లో జరుగుతున్న పలు అబివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సంజయ్‌కుమార్, అదనపు కార్యదర్శి కుమార్ తదితరులు పరిశీలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా 526 గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వేర్వేరుగా సంక్షేమ పథకాలు, అబివృద్ధి పనులను అమలు చేస్తున్నారు. ఈ పనులను డైరెక్టర్ సంజయ్‌కుమార్, అదనపు కార్యదర్శి కుమార్ తదితరులు పరిశీలించారు. నేమం గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని సందర్శించి అక్కడ అమలు చేస్తున్న విధానాలపై వివరాలను సేకరించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలని సూచించారు. అనంతరం కుత్తంబాక్కంలో మహిళ స్వయం ఉపాఽధి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెర్రస్ గార్డెన్‌ను పరిశీలించారు. గార్డెన్‌లోని పంటలు, మొక్కలు, చెట్లు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుత్తంబాక్కంలో చెత్తకుప్పల నుంచి సేంధ్రీయ ఎరువుల తయారీ విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో నేమం పంచాయతీ మాజీ అద్యక్షుడు ప్రేమ్‌నాథ్, కుత్తంబాక్కం మాజీ అధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment