గ్రామ కార్యదర్శుల రాస్తారోకో
తిరువళ్లూరు: గ్రామ కార్యదర్శుల న్యాయమైన సమ స్యలను వెంటనే పరిస్కరించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకోకు యత్నించిన ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందు నిర్వహించిన ధర్నాకు తమిళనాడు గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మెల్కీరాజాసింగ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా కార్యదర్శి మణిశేఖర్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా మెల్కీరాజాసింగ్ మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి శాఖలో ఖాళీగా వున్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, గ్రామ కార్యదర్శులకు వేతన సవరణ సిపార్సులను వెంటనే అమలు చేయాలని. గ్రామ కార్యదర్శులకు జాతీయ ఉపాధి హమీ పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని నినాదాలు చేశారు. అనంతరం రాస్తారోకోకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment