అమ్మ క్యాంటీన్
పునః ప్రారంభం
తిరువొత్తియూరు: చైన్నె తిరువొత్తియూరు ఎల్లయ్యమన్ ఆలయం సమీపంలో కార్పొరేషన్ కాంప్లెక్స్ ప్రాంగణంలో అమ్మ క్యాంటీన్ ఉంది. ఆ కట్టడం పాతబడటంతో ఆ వాణిజ్య కాంప్లెక్స్‌ను కూల్చి వేయాలని కార్పొరేషన్ నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. దీంతో గత నెల అక్కడున్న 30కి పైగా దుకాణాలు, అమ్మ క్యాంటీన్‌కు సీల్ వేశారు. దీనిని అన్నాడీఎంకే నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. త్వరలో పునర్ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో అమ్మ క్యాంటీన్ నిర్వహింపబడుతున్న చోటుకు ఎదురుగా ఉన్న కార్పొరేషన్‌కు చెందిన కాంప్లెక్స్‌లో తిరిగి కొత్తగా అమ్మ క్యాంటీన్ మంగళవారం తిరిగి ప్రారంభమైంది. మండల కమిటీ అధ్యక్షుడు డీఎం తనిఅరుసు దీన్ని ప్రారంభించారు. అమ్మ కాంటీను తిరిగి తెరవడంతో ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
పోలీసులు వేధిస్తున్నారని
కార్మికుడి ఆత్మహత్య
అన్నానగర్: విరుదునగర్ జిల్లా రాజపాళ్యం సమీపంలోని నక్కనేరి గ్రామానికి చెందిన సెల్వకుమార్ (40) ఇతను అగ్ని ప్రమాదంలో బాధితు డు. అతను కూలీ పని చేసేవాడు. అప్పుడప్పుడూ మద్యం సీసాలు కొని అమ్మేవాడని కూడా చెబుతున్నారు. చేటూరు గ్రామ పోలీసులు 3 సార్లు పట్టుకుని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ బైక్‌లో మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం సేత్తూరు సబర్బన్ పోలీసులు సెల్వకుమార్‌ను అరెస్టు చేసి బైకును స్వాధీనం చేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన సెల్వకుమార్ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్వకుమార్ ఓ లేఖ రాశాడని, అందులో పోలీసులు వేధించడమే నా చావుకు కారణమని, పోలీసులు తన డబ్బు తీసుకుని బెదిరించారని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అదుపు తప్పిన బైక్
● ఒకరి మృతి
అన్నానగర్: మైలాడుదురై జిల్లా ఎలందకుడికి చెందిన మహ్మద్ ఆసిక్ కుమారుడు మహ్మద్ సాజిద్(19). అదే ప్రాంతానికి చెందిన మహమ్మ ద్ అలీ కుమారుడు మహ్మద్ రియామ్ (19). కళాశాల విద్యార్థులైన ఇద్దరూ మంగళవారం బైకులో వెళ్తూ కిందపడి తీవ్ర గాయపడ్డారు. వీరిని అంబులెన్స్‌లో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో మహమ్మద్ సాజిత్ తల ఊహించని విధంగా అంబులెన్స్ సీటుకు స్ట్రెచర్ మధ్య చిక్కుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి సుమారు గంటపాటు పోరాడి మహ్మద్ సాజిద్‌ను రక్షించారు. తర్వాత హడావుడిగా తీవ్ర చికిత్స విభాగంలో చేర్చారు. ఇదే సమయంలో ఆసుపత్రి చేరిన అతని స్నేహితుడు మహమ్మద్ రియామ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment