ఇరానియన్ చిత్రాలకు దీటుగా హబిబీ
తమిళసినిమా: నేశం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిన చిత్రం హబిబీ. ఇంతకుముందు అవల్ పేరు తమిళరసీ, విళిత్తిరు వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన మీరా కధిరవన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఇది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల హక్కులను వీ.హౌస్ ప్రొడక్షనన్స్ సంస్థ అధినేత సురేష్ కామాక్షి పొందడం విశేషం. హబిబీ చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఈశా అనే నటుడు ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారని చెప్పారు. దర్శకుడు కస్తూరి రాజా ఇందులో ఒక ముఖ్య పాత్రను పోషించినట్లు తెలిపారు. జో చిత్రం ఫేమ్ మాళవిక మనోజ్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించారని చెప్పారు. ఇది ఇస్లాం ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కరించే చిత్రం అని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 250 కోట్లు మంది ముస్లిం ప్రజలు ఉన్నారని, వారి ఇతివృత్తంతో పక్క రాష్ట్రమైన కేరళలో రూపొందుతున్న పలు చిత్రాలు విజయం సాధిస్తున్నాయని, అయితే తమిళ సినీ చరిత్రలో ఇస్లాం ప్రజలకు సంబంధించిన కథా చిత్రాలు ఎక్కువగా రావట్లేదన్నారు. ఆ లోటు తీర్చే విధంగా ఈ హబిబీ చిత్రం ఉంటుందన్నారు. అంతేకాకుండా ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందన్నారు. కాగా ప్రపంచ సినిమా అన్న పేరు చెప్పగానే ఇరాన్ చిత్రాలు అందరికీ గుర్తుకు వస్తాయన్నారు. చిత్రాలకు దీటుగా హాబిబీ చిత్రం ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విషయం ఏమిటంటే ఇప్పుడు ఏఐ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుకలోకి వచ్చిందని, ఈ టెక్నాలజీతో ఇప్పటికే దివంగత ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మలేషియా వాసుదేవన్ సాహుల్ పంబ భాగ్య వంటి గాయకుల స్వరాలను మళ్లీ వినిపిస్తున్నారని అదేవిధంగా తమ చిత్రంలో ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో నాగూర్ ఈఎం హనీఫా గొంతుతో వల్లోనే వల్లోనే అనే పల్లవితో సాగే పాటను రికార్డ్ చేసినట్లు, ఇది ఈ చిత్రంలో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆవిష్కరించినట్లు దర్శకుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment