గుండెపోటు చికిత్సల్లో విశేష పురోగతి
సాక్షి, చైన్నె : వడపళణిలోని కావేరి ఆస్పత్రి డిసెంబరు 2024లో గుండె సంబంధించి చికిత్సలలో ఎస్‌టీ– ఎస్‌టీఈఎంఐ కేసులలో విశేష పురోగతితో విజయాలను దక్కించుకుందని వైద్య బృందం ప్రకటించింది. బుధవారం స్థానికంగా జరిగిన సమావేశంలో డిసెంబరులో తాము విజయవంతం చేసిన 15 ఎస్‌టీఈఎంఐ కేసుల వివరాలను ప్రకటించారు. కార్డియాలజిస్టులు డాక్టర్ పి. మనోఖర్, డాక్టర్ సి సుందర్, కావేరి సహ వ్యవస్థాపకులు అరవింద్ సెల్వరాజ్‌లు మాట్లాడుతూ, శీతాకాలంలో ఐడబ్ల్యూఎంఐ కేసు పెరుగుదల అధికంగా ఉన్నట్టు, ఈ సమయంలో అధిక ప్రమాదాన్ని గుర్తించి, రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాల కోసం సమయానుకూలంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. డోర్–టూ–బెలూన్(డీ2బీ) నినాదంతో రోగి అడ్మిషన్ నుంచి యాంజియో ప్లాస్టీ, వంటి అన్ని రకాల సేవల మీద దృష్టి పెట్టామన్నారు. 49 నిమిషాల సగటున డీ2బీతో కొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేశామన్నారు.ఇ ది అంతర్జాతీయ ప్రామాణిక సమయం 90 నిమిషాల కంటే చాలా తక్కువగా పేర్కొన్నారు. వేగవంతంగా, సమర్థంగా, ప్రాణాలను రక్షించే చికిత్సలను , గుండె కండరాల నష్టాన్ని తగ్గించే విధంగా, మనుగడ రేటును మెరుగుపరిచే రీతిలో కీలకంగా సమర్థవంతమైన మరియు ప్రాణాలను రక్షించే చికిత్సను అందించడం ద్వారా, గుండె కండరాల నష్టాన్ని తగ్గించడానికి మరియు మనుగడ రేటును మెరుగుపరచడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనేది కావేరి ఆసుపత్రికి మూలస్తంభం గుండెపోటు నిర్వహణకు సంబంధించిన విధానం అని వివరించారు.
ప్రైమరీ యాంజియోప్లాస్టీ, పెరుక్యుటెన్సీ కరోనరీ ఇంటెర్వెన్షన్ అని కూడా ఈ విధానాన్ని పిలుస్తామన్నారు. యాంజియోప్లాస్టీ ప్రోటోకాల్‌లను మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషించడం ఆనందంగాఉందని, 24 గంటల పాటుగా రోగులకు సేవలను అందించేందుకు అన్ని సిద్ధం చేసి ఉంచామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment