ప్లస్–2 పాఠ్యాంశాలను రివిజన్ చేయాలి
వేలూరు: పదవ తరగతి, ఫ్లస్–2 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పాఠ్యాంశాలను రివిజన్ చేసి విద్యార్థులకు అర్థం అయ్యే విధంగా తెలియజే యాల్సిన బాధ్యత టీచర్‌లపై ఉందని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరులో టీటీడీ దేవస్థా నం అద్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర పా ఠశాలలో బుధవారం ఉదయం అకస్మికంగా త నిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఇది వరకు రాసిన ప్రశ్నా జవాబు పత్రాలు, తరగతి గదులు, విద్యార్థులకు బోధించిన విద్యా బోధన పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన స్థలం ఉందా? అనే వాటిపై టీచర్‌ల వద్ద అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయా, తాగునీరు, మరుగు దొడ్లు సౌకర్యం తదితర వాటిపై ఆరా తీశారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి అర్థం కాని పాఠ్యాంశాలను మరోసారి బోధించాలన్నారు. అనంతరం చిత్తేరిలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు, కాలువ నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించారు. ఆమెతో పాటు ఇంజినీర్ నిత్యానందం, జాతీయ రహదారుల శాఖ ఇంజినీర్ ప్రకాష్, కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ జబకని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment