గిరిజన చిన్నారులకు షూటింగ్‌లో శిక్షణ
కొరుక్కుపేట: అంతర్జాతీయ ప్రమాణాలతో షూటింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సంచారజాతి, గిరిజన యువతను గుర్తించే కార్యక్రమం చైన్నె కేంద్రంగా సిరకుగల్ ఫౌండేషన్ ట్రస్ట్ తరపున చైన్నె కోట్టూరుపురంలోని సంచారజాతి కాలనీలో నిర్వహించారు. ఈ మేరకు చైన్నె కార్పొరేషన్ 170వ వార్డు కౌన్సిలర్ కేఆర్ కదిర్ మురుగన్ దీనికి అధ్యక్షత వహించారు. మద్రాసు హైకోర్టు న్యాయవాది లత, మేనేజింగ్ ట్రస్టీ బాలమురుగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలమురుగన్ మాట్లాడుతూ.. చైన్నె బెసిలియో సాఫ్ట్ వేర్ సీఎస్ ఆర్ నిధులతో రాష్ట్రంలోని సంచారజాతి, గిరిజన యువతకు షూటింగ్, విలు విద్యలో ఆసక్తి, నైపుణ్యం ఉన్న 12 నుంచి 16 ఏళ్లలోపు పిల్లలను అన్ని జిల్లాలకు వెళ్లి గుర్తించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తీర్ణత పొందిన 50మంది యువ క్రీడాకారులను ఎంపిక చేసి నైపుణ్యం కలిగిన కోర్సుల్లో ద్వారా శిక్షణ ఇప్పిస్తామన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేలా చేస్తామన్నారు. ఎంపికై న యువ క్రీడాకారుల విద్య, వారి కుటుంబ పోషణ బాధ్యతను నాలుగేళ్ల వరకు సంస్థ భరిస్తుందన్నారు. 10మందికి పైగా యువ క్రీడాకారులు నమూనా షూటింగ్ పరీక్షల్లో పాల్గొని ప్రతిభ కనబర్చారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment