మహారాజా చిత్ర కాంబో రిపీట్?
తమిళసినిమా: నటుడు విజయ్ సేతుపతి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రం మహారాజా. ఇది ఆయన నటించిన 50వ చిత్రం కావడం మరో విశేషం. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఇటీవల చైనా భాషలోనూ అనువదించి విడుదల చేయగా అక్కడ కూడా రూ. 92 కోట్లు వసూళ్లు సాధించినట్లు తెలిసింది. కాగా విలక్షణ నటుడుగా పేరుగాంచిన విజయ్ సేతుపతి ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు మరోపక్క తమిళ బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. నటిస్తున్న తాజా చిత్రాల్లో ట్రైన్ ఒకటి. ఇది త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తాజాగా మరో చిత్రానికి కమిట్ అయినట్టు సమాచారం. ఇంతకుముందు మహారాజా చిత్రాన్ని దిరూట్, థింక్ స్టూడియోస్, ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థలు నిర్మించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా వీటిలో ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ విజయ సేతుపతి హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి నేట్రు ఇండ్రు నాళ్లై చిత్రం ఫేమ్ ఆర్ రవికుమార్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. సైన్స్ ఫిక్షన్ కథా చిత్రంగా రూపొందిన నేట్రు ఇండ్రు నాళ్లై చిత్రం అప్పట్లోనే సంచల విజయాన్ని సాధించింది. దీంతో తాజాగా మహారాజా చిత్ర హీరో, నిర్మాతలతో కలిసి దర్శకుడు ఆర్.రవికుమార్ ఎలాంటి నేపథ్యంలో చిత్రాన్ని చేస్తారో అన్న ఆసక్తి నెలకొంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.
Comments
Please login to add a commentAdd a comment