చిరుత కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు
వేలూరు: వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని వీరిశెట్టిపల్లి, అనుపు, గాంధీ కనవాయి వంటి ప్రాంతంలో చిరుత దాడిలో పశువులు, మేకలు, దూడలు, కోల్లు వంటివి మృతి చెందుతున్నాయి. అదే తరహాలో పరదరామి, మోర్ధాన, గాంధీకనవాయి, మోడికుప్పం వంటి ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో చిరుత కదలికలు ఉన్నట్లు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు తెలిపారు. ఈ విషయం సోయల్ మాధ్యమాల్లో విస్తరించగా ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో బయటకు రాకుండా ఇంటిలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇదిలా ఉండగా అటవీశాఖ ఆధ్వర్యంలో గాంధీ కనవాయి అటవీ ప్రాంతంలో అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేసి చిరుత కదలికలు ఉన్నాయా అనే వాటిపై ప్రత్యేక నిఘా ఉంచారు. వీటిని కలెక్టర్ సుబ్బలక్ష్మి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలను తనిఖీ చేశారు. వీటిలో చిరుత ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లిందో స్పష్టంగా తెలుస్తుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment