మనస్తాపానికి గురయ్యారు
తమిళసినిమా: సినిమా నటీనటులంటే ఎక్కడి నుంచో దిగి రారు. వారు అందరిలాంటి మనుషులే. వారికీ మనసంటూ ఒకటి ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో ఆ మనసు గాయపడుతుంది. దాని నుంచి బయట పడాలంటే మరో సంతోషకరమైన సంఘటన జరగాలి. నటి మీనాక్షి చౌదరి కూడా ఇలాంటి ఘటననే ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఈమె ఇప్పుడు తెలుగులో సక్సెస్‌ఫుల్ యువ కథానాయకిగా రాణిస్తున్నారు. ఇటీవల తెలుగులో మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం గుంటూరు కారం, అదేవిధంగా తమిళంలో విజయ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం గోట్ వంటి చిత్రాల్లో మీనాక్షి చౌదరి నటించి బాగా పాపులర్ అయ్యారు. కాగా ఈమె విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన కొలై అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా విజయ్ సరసన గోట్ చిత్రంలో నటించే లక్కీ చాన్స్ అందుకున్నారు. విజయ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు. ఇందులో కొడుకుగా నటించిన విజయ్ పాత్రను ఏఐ టెక్నాలజీలో రూపొందించారు. ఈ పాత్రకు జంటగా నటి మీనాక్షి చౌదరి నటించారు. చిత్రం విడుదలై మిశ్రమ స్పందన పొందినా వసూళ్ల వర్షం కురిపించింది. ఆ విధంగా గోట్ కమర్షియల్‌గా హిట్ సాధించింది. కాగా ఈ చిత్రంలో తన పాత్రపై వచ్చిన విమర్శలు మనస్తాపానికి గురి చేశాయని నటి మీనాక్షి చౌదరి వాపోయారు. ఇటీవల ఓ భేటీలో పేర్కొంటూ తమిళంలో గోట్ చిత్రంలో నటించడం సంతోషకరం అన్నారు. అయితే లక్కీభాస్కర్ చిత్రంలో నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయన్నారు. లక్కీ భాస్కర్ చిత్రమే తాను డిప్రెషన్‌లో నుంచి బయటపడడానికి తోడ్పడిందని నటి మీనాక్షి పేర్కొన్నారు.
నటి మీనాక్షి చౌదరి
Comments
Please login to add a commentAdd a comment