చైన్నెలో దస్త్‌కర్ బజార్
సాక్షి, చైన్నె: ఓల్డ్ మహాబలిపురం రోడ్డులోని కొట్టివాక్కం రాజీవ్ గాంధీ సాలై వైఎంసీఏ బాయ్స్ టౌన్ వేదికగా దస్త్‌కర్ బజార్ 20 25 ఎగ్జిభిషన్ ఏర్పాటైంది. హస్తకళాకారుల కళానైపణ్యాలను చాటే విధంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. చేతితో సిద్ధం చేసిన నార వస్తువులు, ఎంబ్రాయిడరీ, లెదర్ , తోలు బొమ్మలు, ఆభరణాలు, తుస్సార్ సిల్క్, హ్యాండ్ షిబోరితో క్రాఫ్ట్ వంటి రంగురంగుల వర్ణా లతో వివిధ రకాల వస్తువులు, ఆకర్షణీయమైన ఫొటో ప్రదర్శనలు ఇందులో కొలువు దీర్చారు. కాశ్మీరీ ఉత్పత్తులు, కాళీ ఘాట్, పిచ్వాయి, మదుబని పె యింటింగ్స్ మరింత ఆకర్షణీయంగా కొలువు దీర్చారు. హస్తకళలు, సాంస్కృతిక ప్రదర్శనల క్రాఫ్ట్‌గా జార్కండ్ సంప్రదాయాలు ఉట్టి పడే విధంగా , దేశంలోని వివిధ రాష్ట్రాల రుచికర వంటకాలను పరిచయం చేసే రీతిలో దస్త్‌కర్ మేళా ఇక్కడ కొలువైంది. ఈనెల 12వ తేదీ వరకు రోజూ ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటలకు వరకు ఈ బజార్‌ను ప్రతి ఒక్కరూ సందర్శించ వచ్చు అని నిర్వాహకులు పిలుపు నిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment