● మంత్రి పీకే శేఖర్‌బాబు
కొరుక్కుపేట: అర్చకులు, కార్మికుల సంక్షేమాన్ని పరిరక్షించే ప్రభుత్వంగా ద్రవిడ మోడల్ ప్రభుత్వం పనిచేస్తోందని హిందూధర్మాదాయ శాఖమంత్రి పీకే శేఖర్ బాబు అన్నారు. మంత్రి పీకే శేఖర్ బాబు నేతృత్వంలో 48 పురాతన ఆలయాల అర్చకుల సంప్రదింపుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో అర్చకులు తమ ఆలయాల అభివృద్ధికి కావాల్సిన అదనపు సౌకర్యాలు అర్చకులు, సిబ్బంది వివరించారు. ఈ సమావేశంలో మంత్రి సర్ పీకే శేఖర్‌బాబు మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, హిందూ మత దేవాదాయ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న ఆలయాలను మరమ్మతులు చేసి కుంభాభిషేకాలను నిర్వహించామన్నారు. ఆలయ ఆస్తుల పునరుద్ధరణ పరిరక్షణ కొనసాగుతోంది. అలాగే అర్చకులు, సిబ్బంది సంక్షేమం కోసం వివిధ కొత్త నిబంధనల అమలుకు వీలుగా అర్చకులకు రూ.4 లక్షల గౌరవ వేతనం అందించగా, 2024 డిసెంబర్ వరకు అర్చక ఫీజులో 60 శాతం వాటాగా రూ.79.94 లక్షలు అందించామని వివరించారు. తమిళుల పొంగల్ పండుగ సందర్భంగా ఏటా పూజారులు, కార్మికులకు కొత్త వస్త్రాలు, యూనిఫారాలు అందజేస్తున్నామని, ఏకకాల పూజ కార్యక్రమం కింద 17,000 దేవాలయాలకు నెలవారీ రూ.1,000, ఇంకా 900 మంది విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం రూ.10,000 స్కాలర్‌షిప్‌గా అందించడం జరిగిందన్నారు. 5 సంవత్సరాలకు పైగా ఆలయాల్లో తాత్కాలికంగా పనిచేస్తున్న 229 మంది అర్చకులతో సహా 1,317 మంది ఆలయ సిబ్బందిని రెగ్యూలర్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశానికి హిందూ మత ధర్మాదాయ శాఖ కమిషనర్ పీఎన్ శ్రీధర్, అదనపు కమిషనర్లు డా.రా.సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment