శ్రీలంక నుంచి చైన్నెకి 20 మంది జాలర్లు
కొరుక్కుపేట: శ్రీలంక జైలు నుంచి విడుదలైన పుదకోట్టై, రామనాథపురం, తూత్తుకుడి జిల్లాలకు చెందిన 20 మంది తమిళ జాలర్లు విమానంలో చైన్నెకి చేరుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ అధికారులు బుధవారం ఉదయం జాలర్లను వారి స్వస్థలాలకు పంపారు. గత ఏడాది చివర్లో సరిహద్దు దాటి చేపలు వేటకు పాల్పడుతున్న రాష్ట్రానికి చెందిన జాలర్లను శ్రీలంక నావికా దళం అరెస్టు చేసి అరెస్టు చేసింది. శ్రీలంక కోర్టులో హజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ జాలర్లను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వానికి అత్యావసర లేఖ రాశారు. తదనంతరం భారత్ – శ్రీలంక ప్రభుత్వం సంప్రదింపులు జరిపిన అధికారులు శ్రీలంక జైలులో ఉన్న 20మందిని విడుదల చేసి కొలంబో నుంచి విమానంలో చైన్నెకు తరలించారు.
అంకాళపరమేశ్వరికి
చందన అలంకరణ
తిరువళ్లూరు: నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా పేరంబాక్కంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ అంకాళపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలను బుధవారం ఉదయం నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పేరంబాక్కంలో ప్రసిద్ధి చెందిన అంకాళపరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి ఏటా నూతన సంవత్సరం రోజు ప్రత్యేక పూజలు, అలంకరణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా బుధవారం నూతన సంవత్సరం కావడంతో అమ్మవారిని 25 కిలోల చందనంతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
మంచివాళ్లను
దేవుడు పరీక్షిస్తాడు కానీ..
తమిళసినిమా: వయసుతో సంబంధం లేకుండా ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నటుడు రజనీకాంత్. ఈయన అంటే పడి చచ్చే వీరాభిమానులు ఉన్నారు. రజనీకాంత్ పుట్టిన రోజున, పండగ రోజుల్లో ఆయన్ని చూడడానికి అభిమానులు ఎదురు చూస్తుంటారు. అలా నూతన సంవత్సరం సందర్భంగా స్థానిక పోయస్‌గార్డెన్‌లోని నటుడు రజనీకాంత్ ఇంటి ముందు వందలాది మంది అభిమానులు ఆయన్ని చూడటానికి విచ్చేశారు. దీంతో బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రజనీకాంత్ వారిని కలిసి చేతిలో అభివాదం చేసి ఖుషీ పరిచారు. ఈ సందర్బంగా ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ‘మంచి వాళ్లను దేవుడు పరీక్షిస్తాడు. అయితే వారిని వదిలి పెట్టరు. అదే చెడ్డవారికి చాలా ఇస్తాడు. అయితే వారిని కాపాడరు’ అని ఆయన బాషా చిత్రంలో చెప్పిన డైలాగ్‌ను చెప్పి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
9 జిల్లాల నేతలతో
అన్బుమణి మంతనాలు
సాక్షి, చైన్నె: చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం త దితర తొమ్మిది జిల్లాలకు చెందిన పార్టీ కార్యదర్శు లు, ముఖ్యనేతలతో చైన్నెలో పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు బుధవారం మంతనాలలో మునిగారు. ఇది కాస్త ఆ పార్టీలో చర్చకు దారి తీసింది. గత నెలాఖరులో జరిగిన పీఎంకే ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీలో పార్టీ వ్యవస్థాపకుడు రాందాసుతో అధ్యక్షుడు అన్బుమణి వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. నాలుగు నెలల క్రితం పార్టీలోకి వచ్చిన తన మేనళ్లుడు ముకుందన్‌కు యువజన అధ్యక్ష పదవిని వ్యవస్థాపకుడు అప్పగించడంతోనే అన్బుమణి తీవ్ర ఆగ్రహనికి లోనయ్యారు. ఈ వ్యవహారం పార్టీ పరంగా పెద్ద చర్చ కు దారి తీసింది. మరుసటి రోజే ముఖ్య నేతలు రంగంలోకి దిగి తండ్రి, తనయు డైన రాందాసు, అన్బుమణి రాందాసు మధ్య సయోద్య ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో తనకు ఆ పదవి వద్దు అని ముకుందన్ ప్రకటించడం మరోచర్చకు దారి తీసింది. పార్టీలో పరిస్థితులు సద్దుమనిగినట్టు, సయోధ్య ఫలించినట్టుగా నేతలు పేర్కొంటున్నా, అన్బుమణి వేస్తున్న అడుగులు మాత్రం చర్చకు దారి తీస్తూనే ఉన్నాయి. పార్టీ పరంగా ఎలాంటి సమావేశాలైనా సరే దిండివనం సమీపంలోని తైలాపురంలో ఉన్న ప్రధాన కార్యాలయంలో చర్చించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే వి వాదం జరిగిన రోజున తన కార్యాలయం ఇక పనయూరులో ఉంటుందని, ఇక్కడకు వచ్చి తనను కలవ వచ్చని నేతలకు అన్బుమణి సూచించారు. ఈ పరిస్థితుల్లో చైన్నె పనయూరులోని ఆయన కార్యాలయంలో కొత్త సంవత్సరం రోజున చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం తదితర తొమ్మిది జిల్లాలకు చెందిన పార్టీ కార్యదర్శులు, ముఖ్య నేతలతో అన్బుమణి సుదీర్ఘ మంతనాల్లో మునగడం గమనార్హం. పార్టీ పరంగా, రాజకీయ సంబంధిత అంశాల గురించి ఈ భేటీలో చర్చించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే కొత్త సంవత్సరం వేళ మర్యాద పూర్వక భేటీ అంటూ మరికొందరు నేతలు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment