వీర ధీర శూరన్– 2 సాంగ్ విడుదల
తమిళసినిమా: చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వీర ధీర శూరన్ – 2 . నటి దుషారా విజయన్ నాయకిగా నటిస్తున్న ఇందులో నటుడు ఎస్‌జే సూర్య, సురాజ్ వెంజరముడు తదితరలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌యూ అరుణ్‌కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్విహిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని, తేనీ ఈశ్వర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. హెచ్‌ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా శిబు నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ,థ్రిల్లర్ ఎంటర్‌టెయినర్ కథా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్, టీజర్ విడుదలై మంచి స్పందనను తెచ్చుకున్నాయి. తాజాగా చిత్రంలోని కల్లరూమ్ అనే సింగిల్ సాంగ్‌ను, ఫస్ల్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికిప్పుడు సినీ వర్గాల నుంచి, విక్రమ్ అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోందని యూనిట్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా జీవీ ప్రకాశ్‌కుమార్ బాణీలు కట్టిన కల్లూరుమ్ అనే మెలోడి సాంగ్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment