తలైవాసల్‌లో ఏకీకృత పరిశోధనా సంస్థ | - | Sakshi
Sakshi News home page

తలైవాసల్‌లో ఏకీకృత పరిశోధనా సంస్థ

Published Tue, Jan 14 2025 9:10 AM | Last Updated on Tue, Jan 14 2025 9:10 AM

తలైవా

తలైవాసల్‌లో ఏకీకృత పరిశోధనా సంస్థ

సాక్షి, చైన్నె: ేసలం జిల్లా తలైవాసల్‌లో అత్యాధునిక సౌకర్యాలతోరూ.564.44 కోట్లతో వెటర్నరీ, యానిమల్‌ సైన్సెస్‌ కోసం ఏకీకృత ఉన్నత పరిశోధనా సంస్థ ఏర్పాటైంది. దీనిని చైన్నె నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం స్టాలిన్‌ సోమవారం ప్రారంభించారు. పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య, మత్స్యకారుల సంక్షేమ శాఖ నేతృత్వంలో తలైవాసల్‌ కూట్రోడులో 1,102.25 ఎకరాలలో రూ.564.44 కోట్లతో అధునిక సౌకర్యాలతో ఉన్నత స్థాయి పరిశోధన కేంద్రంగా దీనిని తీర్చిదిద్దారు. అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌, ఎంట్రన్స్‌ ఆర్చ్‌లు, గెస్ట్‌ హౌస్‌ , క్యాంపస్‌లు తదితర 126 భవనాలను ఇక్కడ నిర్మించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, గ్రామీణ ప్రజల జీవన స్థితి మెరుగు పరచడంలో కీలకంగా ఉన్న పశువులకు అధునాతన నాణ్యమైన వైద్య చికిత్సలు, పశువులకు మేత, వంటలి అంశాలతో పాటూ వివిధ సృజనాత్మక అంశాలతో అద్భుతమైన రీతిలో అమలు వెటర్నరీ ,యానిమల్‌ సైన్సెస్‌లో ఇంటిగ్రేటెడ్‌ హయ్యర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌గా నిలిచే విధంగా ఇక్కడ బ్రహ్మాండ నిర్మాణాలు జరిగాయి. అంతే కాదు, పశువుల ఫారమ్‌ కాంప్లెక్స్‌, దేశీయ పశువుల విభాగం, మేకల విభాగం, గొర్రెల విభాగం, దేశీయ పౌల్ట్రీ యూనిట్లు, ఆధునిక హేచరీ, పౌల్ట్రీ ఫీడ్‌ తయారీ ప్లాంట్‌, కాంప్లెక్స్‌లో రీసైక్లింగ్‌ మోడ్‌లో ఆక్వాకల్చర్‌ ప్రక్రియ, చేప పిల్లల ఉత్పత్తి యూనిట్‌, అలంకార, రంగు చేపల పెంపకం యూనిట్‌, చేపల వ్యర్థాలు, కూరగాయల ఉత్పత్తి యూనిట్‌, ప్రయోగశాలలు కూడా ఇక్కడ ఉన్నాయి. 3 వేలమంది యువతకు వెటర్నరీ, యానిమల్‌సైన్స్‌ సంబంధిత నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ ఇవ్వడం, ఉద్యోగ కల్పన దిశగా చర్యలు సైతం తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రులు అనితా రాధాకృష్ణన్‌, సీఎస్‌ మురుగానందం, పశుసంవర్థక శాఖ కార్యదర్శి సత్య ప్రద సాహు, తలైవాసల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ కె. కృష్ణకుమార్‌ పాల్గొన్నారు. అలాగే, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సేలం నుంచి మంత్రి ఆర్‌. రాజేంద్రన్‌, ఎంపీలు సెల్వగణపతి, మలయరసన్‌, సేలం జిల్లా కలెక్టర్‌ బృందా తదితరులు పాల్గొన్నారు.

డ్రీమ్‌ హౌస్‌..

అనంతరం జరిగిన కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అనువాదకుడి అవార్డు గ్రహీతలు తమిళనాడుకు చెందిన 10 మందికి డీఎంకే దివంగత నేత కలైంజ్ఞర్‌ కరుణానిధి కలల గృహం ప్రాజెక్టు ద్వారా గృహాలను కేటాయించారు. తమిళనాడు హౌసింగ్‌ బోర్డ్‌ ఫ్లాట్‌ వీరికి గృహాలను కేటాయించారు. ఇందుకు సంబందించిన ఉత్తర్వులను సీఎం అందజేశారు. తమిళంలో ఉత్తమ అనువాద పుస్తకాలకు సాహిత్య అకాడమీ ద్వారా అవార్డులను దక్కించుకున్న వారికి రూ. 4 లక్షలతో కలల గృహం కేటాయిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సాహితీ అవార్డులు దక్కించుకున్న 10 మందికి కోయంబత్తూరులోని సింగానల్లూరు, చైన్నెలోని షోళింగనల్లూరు, తంజావూరు, చైన్నె శివారులోని అంబత్తూరులో ఈ గృహాలను కేటాయించారు. అలాగే భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జీవిత విశేషాలను పది భాగాలుగా తమిళంలో తర్జుమా చేసిన పుస్తకాలను ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి స్వామినాథన్‌, తమిళాభివృద్ధి విభాగం కార్యదర్శి రాజారామన్‌, డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. అరుల్‌, ప్రొఫెసర్లు ఎన్‌. గౌతమన్‌, వరమది, డిప్యూటీ డైరెక్టర్‌ మదివాసన్‌ పాల్గొన్నారు. అలాగే కార్మిక సంక్షేమం, నైపుణ్యాభివద్ధి శాఖ తరపున రూ. 27.33 కోట్లతో నిర్మించిన కార్మిక శాఖ కార్యాలయ ప్రాంగణం, ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణా సంస్థ భవనాలు, వసతి గృహాలు, జోనల్‌ ట్రైనింగ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయ భవనాలను సీఎం స్టాలిన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. విల్లుపురం జిల్లా మరుదూరు, రామనాథపురం జిల్లా పట్టనం కడల్‌లలో, పుదుకోట్టై జిల్లా విరాళిమలై, చైన్నె జిల్లా పరిధిలోని చాకలిపేట, తంజావూరు జిల్లా ఒరత్తనాడు, సేలం, కృష్ణగిరి జిల్లా డెంకని కోటలలో వీటినినిర్మించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్ముడి, సీవీ గణేషన్‌, ఐఏఎస్‌ అధికారులు అతుల్‌ ఆనంద్‌, వీర రాఘవరావు, విష్ణుచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే మహింద్రా అండ్‌ మహింద్రా నేతృత్వంలో తమిళనాడులో రూపుదిద్దుకున్న ఆరిజిన్‌ ఎస్‌యూవీ ఎక్స్‌ఈవీ 9ఈ, బీఈ6 కార్లను వినియోగదారుల ట్రయల్‌ రన్‌ కోసం జెండా ఊపి సీఎం స్టాలిన్‌ సాగనంపారు.

రూ. 564 కోట్లతో నిర్మాణం

ప్రారంభించిన సీఎం స్టాలిన్‌

10 మంది అనువాదకులకు గృహాలు

No comments yet. Be the first to comment!
Add a comment
తలైవాసల్‌లో ఏకీకృత పరిశోధనా సంస్థ 1
1/1

తలైవాసల్‌లో ఏకీకృత పరిశోధనా సంస్థ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement