ఐఐటీ – సీఎంసీ కొత్త ఆవిష్కరణ
● పక్షవాత రోగుల కోసం దేశీయ రోబోట్ రూపకల్పన
సాక్షి, చైన్నె: పక్షవాతం రోగులకు పునరావాసం కల్పించే విధంగా ఐఐటీ మద్రాసు, సీఎంసీ వేలూరు కలిసి సరికొత్త ఆవిష్కరణ చేశాయి. దేశీయ రోబోట్‌ను ఇందు కోసం రూపకల్పన చేశారు. ఇది థ్రైవ్ రిహాబ్ సొల్యూషన్స్ ద్వారా వాణిజ్య మయం చేశారు. ఈ పేటెంట్ టెక్నాలజీ కచ్చితమైన చికిత్స కదలికలు, నిజ–సమయ అభిప్రాయాన్ని అందిస్తుంది. స్ట్రోక్, వెన్నుపాము గాయం రోగులకు మెరుగైన ఫలితాలను నిర్ధారిస్తుందని ఐఐటీ మద్రాసు వర్గాలు ప్రకటించాయి. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్న, పోర్టబుల్ ప్లగ్ అండ్ ట్రైన్ రోబోట్‌గా ప్రకటించాయి. ఈ పరికర సాంకేతికత టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ఆఫీస్–టీటీఓ ఐసీఎస్‌ఆర్ ద్వారా లైసెన్స్ పొందిందినట్టు పేర్కొన్నారు. క్లినికల్, హోమ్ సెట్టింగ్‌లలో సరసమైన, అనుకూలమైన పునరావాస పరిష్కారాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ వినూత్న పరికరం ఉపయోగంగా ఉంటుందని వివరించారు. గత నాలుగు సంవత్సరాలుగా 1000 మంది రోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా దీని ప్రయోగం విజయవంతంగా చేశారు. అకడమిక్ రీసెర్చ్ విజయవంతంతో సామాన్యులకు చేరువయ్యే విధంగా వేలాది మంది రోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
ఈ ఆవిష్కరణ గురించి ఐఐటీ మద్రాసు మెకానికల్ ఇంజినీర్ నెహ్రూ (స్కాలర్), వేలూరు సీఎంసీ బయో ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ శివకుమార్. బాలసుబ్రమణియన్ స్థానికంగా శుక్రవారం వివరించారు. ఈ పేటెంట్ పొందిన సాంకేతికత ఖచ్చితమైన చికిత్స కదలికలకు మార్గంగా పేర్కొన్నారు. ఈ పరికరం పునరావాస కేంద్రాలు, క్లినిక్‌లు, ఆస్పత్రులు, రోగుల ఇళ్లలో కూడా ఉపయోగించడానికి వీలుందన్నారు. తక్కువ–ధర కల్పన ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, రోగులకు అనుకూలత, స్తోమతను నిర్ధారిస్తుందన్నారు. స్ట్రోక్ లేదా చేతి పక్షవాతం వంటి పరిస్థితుల కోసం ముందస్తు పునరావాస దశలను పరిష్కరించే డిజైన్, వేగవంతమైన పనితీరు మెరుగుదలను ప్రోత్సహిస్తుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment