కన్యాకుమారి జాలర్లతో పాటు 15 మంది అరెస్టు
– హద్దు దాటడంతో చర్యలు
సేలం : లోతైన సముద్రంలో హద్దులు దాటి చేపలు పడుతున్న కన్యాకుమారి జిల్లా జాలర్లతో పాటూ 15 మందిని బ్రిటీష్ భద్రతా దళం ఆదివారం అరెస్టు చేసింది. కన్యాకుమారి జిల్లాకు చెందిన జాలర్లు పలువురు సముద్రంలో లోతైన ప్రాంతాలలో చేపలు పడుతూ వస్తున్నారు. వీరి నెలల తరబడి అక్కడే ఉండి చేపలు పట్టి తీరానికి రావడం పరిపాటి. అప్పుడు సముద్రపు అద్దులు దాటి వస్తే విదేశీ భద్రతా దళంతో అరెస్టుకు గురవుతున్నారు. ఇదేవిధంగా ప్రస్తుతం 15 మంది తమిళ జాలర్లు అరెస్టు కావడం కలకలం రేపింది. కన్యాకుమారి జిల్లా తూత్తుకుడికి చెందిన జాలర్లి షార్జిన్. ఇతనికి సొంతమైన మోటారు పడవలో గత డిసెంబర్ 22వ తేదీ 15 మంది జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారిలో తూత్తుకుడికి చెందిన 8 మంది జాలర్లు, ఉత్తర భారాతానికి చెందిన ఏడుగురు జాలర్లు ఉన్నారు. వీరి డిక్కోసియా ద్వీపం సమీపంలో లోతైన సముద్రపు ప్రాంతంలో ఉండి చేపలు పడుతూ వచ్చారు. అప్పుడు అక్కడికి వచ్చిన బ్రిటీష్ సముద్రతీర బలగాలు జాలర్లను హద్దులు దాటి చేపలుపడుతున్నారని 15 మందిని అరెస్టు చేశారు. వారి పడవను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం గురించి భారత విదేశాంగ శాఖకు సమాచారం ఇచ్చారు. వారు కన్యాకుమారి జిల్లా అధికారులకు తెలిపారు. ఈ ఘటన జాలర్లలో దిగ్భ్రాంతిని కలిగించింది.
తాటిచెట్టును ఢీకొన్న బైక్
– ముగ్గురు మిత్రుల దుర్మరణం
సేలం : కోవై పొల్లాచ్చి సాలైలో తాట్టి చెట్టుపై బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మిత్రులు దుర్మరణం చెందారు. వివరాలు.. కోవై జిల్లా కినత్తు కడవు సమీపంలోని సింగైయ్యన్ పుదూర్ గ్రామానికి చెందిన ప్రభు (33), వీరమణి (33), కరుప్పుసామి (29) ముగ్గురు మిత్రులు. వీరు ఆదివారం సొంత పని నిమిత్తం వెళ్లి ఒకే బైక్‌పై పొల్లాచ్చి – కోవై రోడ్డులో ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. వీరమణి బైక్‌ను నడిపాడు. ముగ్గురు యువకులు హెల్మెట్‌లు ధరించలేదు. వారు కాదనూత్తన్ మేడు అనే ప్రాంతలో వేగంగా వస్తుండగా అదుపుతప్పిన బైక్ రోడ్డు పక్కన ఉన్న తాటి చెట్టును ఢీకొంది. వీరు ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని అంబులెన్స్ ద్వారా పొల్లాచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా ముగ్గురూ మృతి చెందారు. కినత్తుకడవు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మాటల యుద్ధం
సాక్షి, చైన్నె: రాష్ట్ర గవర్నర్, ప్రభుత్వం మధ్య మాటల వివాదం మొదలైంది. సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి గవర్నర్ చేసిన ట్వీట్‌పై డీఎంకే ప్రధాన కార్యదర్శి, సీనియర్ మంత్రి దురై మురుగన్ స్పందించారు. గవర్నర్ అన్న గర్వంతో ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. అసెంబ్లీ వేదికగా గవర్నర్ ఆర్‌ఎన్ రవి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతురన్న సమరం మరో గతవారం తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి ఇచ్చిన ప్రసంగం పాఠాన్ని చదవకుండానే సభ నుంచి గవర్నర్ వెళ్లిపోయారు. గత మూడేళ్లుగా గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుపై డీఎంకే పాలకులు తీవ్ర ఆగ్రహాన్ని, ఆరోపణలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా జరిగిన పరిణామాలపై శనివారం జరిగిన సభలో సీఎం స్టాలిన్ తన ఆగ్రహాన్ని మరో వ్యక్తం చేశారు. గవర్నర్ చర్యలను చిన్న పిల్లల చేష్టలుగా పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో రాజ్ భవన్ ఎక్స్‌పేజీలో ఆదివారం గవర్నర్ చేసిన ట్వీట్ డీఎంకే పాలకులలో మరింత ఆగ్రహాన్ని రేపింది. సీఎం స్టాలిన్ అహంకారిగా పేర్కొంటూ గవర్నర్ వ్యాఖ్యానించడాన్ని దురై మురుగన్ తీవ్రంగానే పరిగణించారు. సోమవారం స్థానికగా ఆయన స్పందించారు. బాధ్యత గల పదవిలో ఉన్న గవర్నర్ అసెంబ్లీని అవమాన పరిచే విధంగా వ్యవహరించడమే కాకుండా, రాజకీయ నాయకుడి తరహాలో ప్రకటనలు ఇచ్చుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ అన్న గర్వంతో ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ నిబంధనలను ఉల్లంగించి తప్ప చేసిందే కాకుండా, సీఎంను అహంకారి అని గవర్నర్ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment