మొదటి చిత్రంలా చేశాను..! | - | Sakshi
Sakshi News home page

మొదటి చిత్రంలా చేశాను..!

Published Sun, Feb 9 2025 1:42 AM | Last Updated on Sun, Feb 9 2025 1:42 AM

మొదటి చిత్రంలా చేశాను..!

మొదటి చిత్రంలా చేశాను..!

తమిళసినిమా: ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సుశీంద్రన్‌ రూపొందించిన తాజా చిత్రం 2కే లవ్‌ స్టోరీ. సిటీ లైట్స్‌ పిక్చర్స్‌ పతాకంపై విగ్నేష్‌ నిర్మించిన ఈ చిత్రం ద్వారా నటుడు జగవీర్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. నటి మీనాక్షి గోవింద్‌ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ది ఇమాన్‌ సంగీతాన్ని, ఆనంద్‌ కష్ణ ఛాయాగ్రహణంను అందించారు. ఈ తరం ప్రేమ కథ చిత్రం గా రూపొందిన 2 కే లవ్‌ స్టోరీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 14వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర ఆడియో ట్రైలర్‌ ఆవేశం కార్యక్రమాన్ని స్థానిక సాలి గ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌ నిర్వహించారు. ఇందులో దర్శకుడు ప్రభు సాలమన్‌, జి ధనంజయన్‌ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర ఆడియో ఆవిష్కరించారు. చిత్ర దర్శకుడు సుశీంద్రన్‌ మాట్లాడుతూ వెన్నెల కబడి కుళు చిత్రం తర్వాత తాను మొదటి చిత్రంగా దర్శకత్వం వహించింది 2లవ్‌ స్టోరీ అని చెప్పారు. దీనికి డి ఇమాన్‌ సంగీతం పెద్ద బలం అని పేర్కొన్నారు.

ఙచదనుగా ఇప్పుడు ఎక్కువగా నెగటివ్‌ విషయాల గురించి చర్చ జరుగుతోందని, అయితే పాజిటివ్‌ విషయాలు కూడా జరుగుతున్నాయని అలాంటి పాజిటివ్‌ అంశాలతో రూపొందించిన చిత్రం 2కే లవ్‌ స్టోరీ అని చెప్పారు. దీనికి నిర్మాత విఘ్నేష్‌ సహకారం చాలా ఉంది అన్నారు. తాను ఇంతకుముందు పాండినాడు, పాయం పులి వంటి చిత్రాలను స్టార్‌ హీరోలతో చేశానని అయితే వాటిలో పాయంపులి చిత్రానికి మాత్రమే నటుడు విశాల్‌ ను దష్టిలో పెట్టుకొని కథను సిద్ధం చేశానని, ఆ తర్వాత 18 చిత్రాలు చేశానని వాటన్నిటికీ కథకు తగిన నటీనటులనే ఎంపిక చేశానని చెప్పారు. అదేవిధంగా ఈ 2 కే లవ్‌ స్టోరీకి నూతన నటీనటులు అవసరం అయ్యారని చెప్పారు. చిత్రంలో ప్రేమతో పాటూ చక్కని సందేశం కూడా ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని పలువురు సినీ దర్శకులకు ప్రత్యేకంగా ప్రదర్శించి చూపించినట్లు సుశీంద్రన్‌ చెప్పారు. ఇది కచ్చితంగా అన్ని వర్గాలు చూసే ఆనందించే విధంగా ఉంటుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement