![అన్నాడీఎంకే జోనల్ మహానాడుకు పందకాల పూజ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/08cni11-300096_mr-1739045036-0.jpg.webp?itok=G2uQpiD6)
అన్నాడీఎంకే జోనల్ మహానాడుకు పందకాల పూజ
వేలూరు: వేలూరు కోట మైదానంలో ఈనెల 16వ తేదీన జరగనున్న రీజనల్ స్థాయి కార్యకర్తల మహానాడు పందకాల పూజలు శనివారం ఉదయం జరిగింది. ఇందుకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్‌ఆర్‌కే అప్పు అధ్యక్షత వహించగా మాజీ మంత్రులు కేసీ వీరమణి, అగ్రి క్రిష్ణమూర్తి, సోమసుందరం, ముక్కూరు సుబ్రమణియన్, సేవూరు రామచంద్రన్ ముఖ్య అతిథులుగా కలుసుకొని పందకాల పూజలు చేశారు. అనంతరం కార్యకర్తలతో సమీక్షించి మహానాడుకు అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని అన్నారు. పార్టీలోని కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి మహానాడును విజయవంతం చేయాలన్నారు. ఇందులో రాష్ట్రంలోని మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఎడపాడి పయణిస్వామి కలుసుకుంటారన్నారు. అనంతరం మహానాడు ఏర్పాట్లుపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పరమశివం, వాలాజబాద్ గణేశన్, ఆరణి సౌత్ జిల్లా కార్యదర్శి జయసుధ, ఎమ్మెల్యే రవి, మాజీ ఎమ్మెల్యే లోకనాథన్, ఐటీ విభాగం జిల్లా కార్యదర్శి జణనీ సతీష్‌కుమార్, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment