పెళ్లిపీటలెక్కిన.. ఆరేళ్ల ప్రేమ
● అమెరికా అమ్మాయితో నెల్‌లై యువకుడి పెళ్లి
సేలం : రాష్ట్రంలో ఇటీవల విదేశీ అమ్మాయిలను ప్రేమించి తమిళ సాంప్రదాయంలో వివాహాలు చేసుకునే అబ్బాయిల సంఖ్య పెరిగింది. తాజాగా నెల్‌లైకి చెందిన ఓ యువకుడు అమెరికా అమ్మాయిని ఆరేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తిరునెల్వేలి జిల్లా పాపనాశం సమీపంలో ఉన్న శివంతిపురం కస్పా ప్రాంతానికి చెందిన భగవతి, అమ్మాపొన్ను దంపతుల కుమారుడు ఇసక్కిముత్తు (34). ఇతను మెక్సికోలో గత ఆరు సంవత్సరాలకు పైగా ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ స్థితిలో ఇసక్కిముత్తు తాను నివసిస్తున్న ప్రాంతంలో ఉంటున్న మెక్సికోకు చెందిన అసువాని లోపేస్ (32) అనే యువతి ప్రేమించాడు. గత ఆరు సంవత్సరాలుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అసువాని లోపేస్ మెక్సికో దేశంలో నేర విభాగం న్యాయమూర్తిగా ఉద్యోగం చేస్తోంది. వీరిద్దరి ప్రేమకు ఇరు కుటుంబీకులు అంగీకరించడంతో వీరికి మెక్సికోలో వివాహం జరిగింది. ఈ స్థితిలో ఇసక్కి ముత్తు సొంత ఊరు తిరునెల్వేలి పాపనాశంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ రిసెప్షన్ శనివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం నవ దంపతులు పాపనాశం ఆలయంలో స్వామిని దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment