![మదగజరాజా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/08cni08-300105_mr-1739045035-0.jpg.webp?itok=Q9GZvQkL)
మదగజరాజా
విశాల్, దర్శకుడు సుందర్ సి
తమిళసినిమా: ఏ రంగంలోనైనా సక్సెస్ వైపే అడుగులు పడుతుంటాయి. ఇందుకు సినిమా రంగం అతీతం కాదు. సక్సెస్ ఫుల్ కాంబో రిపీట్ కానుందన్నది తాజా సమాచారం. విశాల్ కథానాయకుడిగా నటించిన మదగజ రాజా చిత్రం అనేక ఆటంకాలను ఎదుర్కొని 12 ఏళ్ల తర్వాత ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి కథ దర్శకత్వం బాధ్యతలను సుందర్ సి నిర్వహించారు. వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి కథానాయికలుగా నటించిన ఇందులో నటి హన్సిక ప్రత్యేక పాత్రల్లో నటించారు. కాగా ఇప్పుడు మరోసారి విశాల్, దర్శకుడు సుందర్ సి కాంబోలో ఒక భారీ చిత్రం రూపొందడానికి అడుగుల పడుతున్నట్లు తెలిసింది. వీరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు కూడా ఆండాళ్, యాక్షన్ వంటి చిత్రాలు రూపొందాయన్నది గమనార్హం. కాగా నాలుగో సారి నటుడు విశాల్, దర్శకుడు సుందర్ సి కలిసి చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. కాగా ఇందులో ప్రముఖ హాస్య నటుడు వడివేలును ముఖ్యపాత్రలో నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. దీన్ని నటి, నిర్మాత కుష్బూ కు చెందిన అవ్ని సినీ మాక్స్ సంస్థ రూ. 100 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మించబోతున్నట్లు తెలిసింది. అదే విధంగా బెంజ్ మీడియా సంస్థ అధినేత ఏసీ అరుణ్ కుమార్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సుందర్ సి దర్శకత్వంలో వడివేలు నటిస్తున్న గ్యాంగ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా విశాల్ హీరోగా సుందర్ సి తెరకెక్కించనున్న చిత్రం వచ్చే నెలలోనే ప్రారంభం కానున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.
కాంబో రిపీట్?
Comments
Please login to add a commentAdd a comment