తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు మొదలైన పరీక్ష మధ్యాహ్నం 12 గంటలకు ముగియనుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 16న (గురువారం) ప్రారంభం అవుతాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఇంటర్మీడియట్ పరీక్షలను ఏప్రిల్ 4వరకు నిర్వహించనున్నారు.
తెలంగాణలో..
తెలంగాణలో మొత్తం 9,47,699 మంది పరీక్షలు రాస్తున్నారు. వీరిలో 4,82,677 మంది ఫస్టియర్, 4,65,022 మంది సెకెండీయర్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 75 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ పనిచేస్తున్నాయి. విద్యార్థులకు ఏ ఇబ్బంది తలెత్తినా 040– 24601010, 040– 24655027 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10,03,990 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,84,197 కాగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,19,793 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి 20-25 పరీక్ష కేంద్రాలకు కలిపి ఒక అంబులెన్సును సిద్ధంగా ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment