ఆశనిరాశల ‘డీఎస్సీ’
కాణిపాకానికి రెండు ఆర్టీసీ సర్వీసులు
భక్తుల రద్దీ నేపథ్యంలో కాణిపాకానికి అదనంగా రెండు ఆర్టీసీ సర్వీసులు నడపనున్నట్లు తిరుపతి డిపో మేనేజర్ తెలిపారు.
తల్లి మందలించిందని!
తల్లి మందలించిందని అర్ధరాత్రిలో ఇంటి నుంచి పారిపోయిన యువతి కలువాయి సమీపంలో శవమై తేలింది.
బుధవారం శ్రీ 6 శ్రీ నవంబర్ శ్రీ 2024
చేతివృత్తిపైనే
వందకుపైగా కుటుంబాలు
మండలంలో నారాయణవనం, తుంబూరు, అరణ్యకండ్రిగ వీవర్స్ కాలనీ, పాలమంగళంలో వందకుపైగా కుటుంబాలు పట్టుచీరల తయారీపై ఆధారపడి జీవిస్తున్నాయి. నారాయణవనం, తమిళనాడు ఆరణిలో మాస్టర్‌వీవర్ల వద్ద కొందరు కూలీలుగా పనిచేస్తున్నారు. నేసే చీరల డిజైన్లకు వివిధ రంగుల పట్టుదారాల చిలకలను మార్చడానికి నేతన్నతో మరొకరు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. 300 నుంచి 400 గ్రాముల బరువుండే సింగిల్ త్రెడ్ సాధారణ పట్టుచీరను వారం రోజుల్లో నేస్తే, జాకాడ్, డ్రాబీలపై పోస్టర్ డిజైన్ చీరను 12 నుంచి 20 రోజుల్లో తయారు చేస్తారు. చీర డిజైన్, జరీల ఆధారంగా ఒక్కో చీరకు రూ.1,600 నుంచి రూ.3 వేల వరకు కూలీ లభిస్తుందని కార్మికులు చెబుతున్నారు. పెట్టుబడి పెట్టి చీరలను తయారు చేసినా.. మార్కెటింగ్ సౌకర్యం లేక మాస్టర్ వీవర్ల వద్ద కూలికి చేరినట్టు నేతన్నలు చెబుతున్నారు.
పట్టుచీరలను నేస్తున్న కార్మికుడు
ఇమిటేట్‌తో ఇబ్బంది
చౌకగా లభించే ఇమిటేట్ కాపర్ జరీ పట్టుచీరలతో ఇబ్బందులెదురవుతున్నాయి. పట్టుచీర తక్కువ బరువుతో సున్నితంగా ఉంటుంది. 300 గ్రాముల నుంచి 700 గ్రాముల వరకు బరువుండే పట్టుచీరల్లో పోస్టర్ డిజైన్ జాకాడ్ స్పెషల్ వెడ్డింగ్ శారీలు అందుబాటులో ఉన్నాయి. 2 గ్రాముల బంగారంతో జరీ చీరలను రూ.40 వేల నుంచి రూ.65 వేల వరకు విక్రయిస్తున్నాం. వెండి జరీ చీరలను స్పెషల్ లుక్‌తో పార్టీ వేర్‌గా అందిస్తున్నాం. ఆర్డర్లపై నచ్చిన రంగులు, డిజైన్లతో 20 రోజుల్లో చీరను తయారు చేస్తాం. – మునస్వామి,
మాస్టర్ వీవర్, నారాయణవనం
మెచ్చుకుంటే చాలు!
పెద్దల నుంచి నేర్చుకున్న వృత్తిని నమ్ముకుని బతుకుతున్నా. నేను తయారు చేసిన చీర బాగుందని మెచ్చుకుంటే చాలు ఆ తృప్తే వేరు. కూలీ గిట్టకపోయినా.. పట్టుచీర తయారీతో కలిగే తృప్తితో పడిన కష్టాన్ని మరిచిపోతున్నాం. రోజుకు ఐదు గంటలు పనిచేస్తే వారానికి ఒక చీర తయారవుతుంది. భారీ చీరకు 20 రోజులు పడుతుంది. తమిళనాడు తరహాలో 200 యూనిట్ల విద్యుత్ రాయితీ, మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తే పట్టు పరిశ్రమకు ప్రోత్సహం లభిస్తుంది.
– మునీశ్వరయ్య, కార్మికుడు, నారాయణవనం
ప్రభుత్వం ఆదుకోవాలి
గతంలో నెలకు 4 కిలోల ముడిపట్టు కొనుగోలుకు రూ.600 అందేది. జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే నేతన్న నేస్తం పథకంతో ఐదేళ్ల పాటు రూ.24 వేల చొప్పున అందించి ఆదుకున్నారు. చేనేతకు మరమగ్గాల ఉత్పత్తులు పోటీ రావడంతో చీరలను అమ్ముకోలేని పరిస్థితి ఎదురవుతోంది. మార్కెటింగ్ సదుపాయంతో పాటు విద్యుత్, పట్టుపై సబ్సిడీని ప్రభుత్వం అందించాలి. –పరంధామయ్య, పాలమంగళం నార్త్
ఆలయంలో ఫిర్యాదుల పెట్టె
శ్రీకాళహస్తి: భక్తుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశారు. సుమారు 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయడం గమనార్హం. ఆలయ ఆవరణలోని బంగారు ధ్వజస్తంభం పక్కనున్న వినాయకుడి గుడి ముందు ఈ ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశారు. భక్తులు తమ సమస్యలను, ఫిర్యాదులను, సలహాలు, సూచనలను రాతపూర్వకంగా ఈ ఫిర్యాదుల పెట్టెలో వేయవచ్చు. ఈ ఫిర్యాదుల పెట్టె బాధ్యతలను ఏఈఓ స్థాయి అధికారికి లోకేష్‌రెడ్డికి అప్పగించారు. ఇలాంటి ఫిర్యాదు పెట్టెలు ఆలయంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తే అనుకూలంగా ఉంటుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
రోగాలపై
అవగాహన అవసరం
తిరుపతి అర్బన్: ప్రతి ఒక్కరూ రోగాలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం వైద్యాధికారులతో కలసి మహిళలల్లో బ్రెస్ట్ క్యాన్సర్ స్వీయ పరీక్ష పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కాన్స్టోరియమ్ ఆఫ్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీ– హాయ్ ) సంస్థ, పరివర్తన స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా వ్యాప్తంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రతి మహిళ తమ ఆరోగ్య సంరక్షణ కోసం బ్రెస్ట్ క్యాన్సర్ హెల్ప్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంఎచ్‌ఓ డాక్టర్ శ్రీహరి, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి అమర్నాథ్ పాల్గొన్నారు.
15న ఐటీఐ అప్రెంటీస్
తిరుపతి అర్బన్: ఐటీఐ పూర్తిచేసుకున్న వారికి ఈనెల 15న నెల్లూరు నగర సమీపంలోని కాకుటూరు వద్ద ఆర్టీసీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ఈనెల 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న ఐటీఐకి చెందిన వివిధ గ్రేడ్‌ల వారు అర్హులని తెలిపారు. ఆ మేరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని వెల్లడించారు.
మగువులు మెచ్చే పట్టు చీరలు.. వెడ్డింగ్ శారీలు.. ఫంక్షన్లలో స్పెషల్ లుక్కుతో ఆకట్టుకునే డిజైన్లు చేయడంలో నారాయణవనం నేతన్నలు ఆరితేరిపోయారు. తరతరాలుగా మగ్గాలపైనే తమ నైపుణ్యాన్నంతా రంగరించి రకరకాల పట్టు చీరలు తయారు చేస్తుంటారు. సింగిల్ త్రెడ్, డబుల్ త్రెడ్, వెండి జరీ, బంగారు జరీ చీరలు డ్రాబీ, జాకాడ్ డిజైన్లతో అత్యద్భుతంగా నేసి ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ తయారయ్యే చీరలు చైన్నె, బెంగళ్లూరు, హైదరాబాద్‌లోని ప్రముఖ బ్రాండెడ్ షాపులకు ఎగుమతి చేస్తుంటారు. కంచి, ఆరణి, ధర్మవరం పట్టు చీరలను కలగలిపి ఒకే పట్టు.. ఒకే బ్రాండ్ చీరలుగా నేయడం వీరి ప్రత్యేకత. నారాయణవనం పట్టు చీరలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
నారాయణవనం: పూర్వీకుల కాలం నుంచి నారాయణవనం పట్టువస్త్రాలకు పెట్టింది పేరు. ఇక్కడ గతంలో 600 కుటుంబాలకుపైగా మగ్గాలు పెట్టుకుని పట్టువస్త్రాలు నేసేవారు. ప్రస్తుతం వందకుపైగా కుటుంబాల వారు తమ కులవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరు నేసే పట్టు చీరలు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ వస్త్ర దుకాణదారులు కొనుగోలు చేసి వివిధ బ్రాండ్ల పేరుతో విక్రయిస్తుంటారు. మరికొందరు సొంతంగా షాపులు పెట్టుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. సాధారణంగా వెండి, బంగారు జరీ పట్టు చీరలను తమదైన శైలిలో నేసి మగువుల మనసు దోచుకుంటున్నారు. ఒక్కో చీర రూ.5 వేల నుంచి రూ.65 వేల వరకు విక్రయిస్తుంటారు.
ఒకే బ్రాండ్.. ఒకే పట్టు
పట్టుతో నేసే చీర ఒకటే. కానీ జాకాడ్, డ్రాబీలపై వివిధ డిజైన్లతో తయారయ్యే చీరలు కొత్తకొత్త పేర్లతో మార్కెట్లోకి వస్తుంటాయి. కొత్త రకం చీరకు కొత్తపేరుతో మార్కెట్లోకి తెచ్చి విక్రయిస్తుంటారు. పట్టులో వెండిని, బంగారాన్ని స్వల్పంగా కలిపి జరీ చీరలను నేస్తుంటారు. నారాయణవనంలో సాధారణ, బంగారు జరీ చీరలు పోస్టర్ డిజైన్లతో జాకాడ్, డ్రాబీలతో తయారు చేస్తున్నారు. పేర్లు ఎన్నైనా వాడే పట్టు నాణ్యత, పోగుల సంఖ్య, వెండి, బంగారం, డిజైన్ల ఆధారంగానే బరువు ఉంటుంది.
చేయూత కోసం ఎదురుచూపు
గతంలో పట్టు కొనుగోలుకు కిలోకు రూ.150 చొప్పున నెలకు గరిష్టంగా రూ.600ను ప్రభుత్వం నేరుగా నేతన్నల బ్యాంక్ ఖాతాకు జమచేసేది. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే వైఎస్సార్ నేతన్న నేస్తంతో ఐదేళ్లు వరుసగా ఏడాదికి ఒకేసారి రూ.24 వేలు బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అండగా నిలిస్తే పెట్టుబడి భారం తగ్గించుకునే ఆస్కారం ఉంటుందని నేతన్నలు చెబుతున్నారు.
నేటి నుంచి వస్త్రాల వేలం
తిరుపతి కల్చరల్: శ్రీతాతయ్యగుంట గంగమ్మ తల్లికి సమర్పించిన చీరలు, జాకెట్లు వేలం పాట ద్వారా బుధవారం నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు విక్రయాలు చేపట్టనున్నట్టు ఈఓ తెలిపారు. వేలం పాట నాలుగు కాళ్ల మండపం వద్ద రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 7.30 గంటల వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు.
మెప్మా ఆర్పీలకు శిక్షణ
తిరుపతి తుడా: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుపతి సీఎల్‌సీ సెంటర్‌లో మంగళవారం మెప్మా ఆర్పీలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్‌హెచ్‌జీ ప్రొఫెలింగ్ యాప్‌లో జిల్లాలోని అన్ని సంఘాల సభ్యుల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సభ్యుల జీవనోపాధి, అర్హతలు, అనుభవం వంటి వివరాలను నమోదు చేసే ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారితపై దృష్టి సారించి వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు, వ్యాపార మెలకువలు, సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ప్రొత్సహించడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పీడీ రాధమ్మ, గోపి, సోము, ప్రమీల, కృష్ణవేణి, సీఓలు, ఆర్పీలు పాల్గొన్నారు.
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. నాలుగు నెలలుగా మాటలతో కాలక్షేపం చేసిన కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు ప్రక్రియకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల గుర్తింపు పూర్తి చేసినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. అయితే ఎస్‌జీటీ పోస్టులే అధికంగా ఉండడంతో బీఈడీ అభ్యర్థుల్లో నిరాశ పెల్లుబుకుతోంది. స్కూల్ అసిస్టెంట్ స్థానాలు తక్కువగా ఉన్నట్లు తెలియడంతో వారిలో అసహనం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఎక్కువ మంది డీఎడ్ అభ్యర్థులకే అవకాశం దక్కనుంది.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
చేతి మగ్గంపైనే అద్భుతమైన చీరలు
కట్టిపడేస్తున్న వెండి, బంగారు జరీ శారీలు
దక్షిణ భారత దేశంలోని
ప్రముఖ వస్త్ర దుకాణాలకు ఎగుమతి
ఆర్డర్లపై 20 రోజుల్లో నచ్చిన విధంగా కోకల తయారీ
చేయూత కోసం ఎదురు చూస్తున్న నేతన్న
ధరలో భారీ వ్యత్యాసం
బ్రాండెడ్ షాపుల్లో అమ్మే పట్టుచీరల ధరలతో పోల్చుకుంటే ఇక్కడ ఉత్పత్తిదారుల వద్ద దొరికే పట్టుచీరలు 30 శాతం తక్కువకే దొరుకుతాయి. డైలీ వేర్ సింగిల్ త్రెడ్ పట్టు చీర 3000 గ్రాముల బరువుతో రూ.5 వేల నుంచి విక్రయిస్తున్నారు. డబుల్ త్రెడ్ పార్టీ వేర్ చీరలైతే రూ.7 వేల నుంచి రూ.25 వేల వరకు దొరుకుతాయి. రెండు గ్రాముల బంగారంతో అత్యధికంగా 700 గ్రాముల బరువు తో స్పెషల్ వెడ్డింగ్ శారీ రూ.65 వేలకే నేస్తున్నారు. ఆర్డర్లపై నచ్చిన డిజైన్, రంగులతోనూ 20 రోజులకే పట్టుచీరలను నేతన్నలు అందిస్తున్నారు.
చేనేతపైనే మగువులకు మక్కువ
చేనేత మగ్గాలపై తయారయ్యే పట్టు చీరల నాణ్య త, డిజైన్, సున్నితత్వంపైనే సీ్త్రలు మక్కువ చూపు తున్నారు. ఈ నేపథ్యంలో నారాయణవనంలోని నేతన్నలు వారి మనసుకు నచ్చేవిధంగా డిజైన్లు తయారు చేస్తున్నారు. మాస్టర్ వీవర్లు కంచి, ధర్మ వరం నుంచి ముడిపట్టును తెప్పించుకుని స్థానికంగా రంగులు అద్ది సొంత డిజైన్లతో డ్రాబీ, జాకాడ్‌పై తయారైన చీరలను చైన్నె, బెంగళూరు, హైదరాబాద్‌లోని ప్రముఖ వస్త్ర దుకాణాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడ వీటిని వివిధ బ్రాండ్లుగా విభజించి వ్యాపారులు విక్రయాలు సాగిస్తున్నారు.
మాయ చేస్తున్న ఇమిటేట్ పట్టు
ఇమిటేట్ పట్టు మార్కెను ఆకట్టుకుంటోంది. బంగారం, వెండి జరీతో పట్టుచీరలకు పోటీగా రాగి జరీతో ఇమిటేట్ పట్టు చీరలు తయారవుతున్నాయి. జరీ, డిజైన్, కొంగు రాగి రంగుతో పట్టుచీరలకు దీటుగా తక్కు వ ధరకే అంటే రూ.500కే మార్కెట్లో దొరు కుతున్నాయి. ఇమిటేట్ పట్టు(కాపర్ పట్టు) చీరను ఉతికితే జరీ ముడతలతో కుంచించుకుపోవడంతో పాటు మెత్తదనం కోల్పోతుంది. నారాయణవనంలో తయారయ్యే వెండి, బంగారంతో కలిసిన నాణ్యమైన పట్టు చీరలను డ్రైక్లీనింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఎన్ని సార్లు డ్రైక్లీనింగ్ చేసినా చీరలో జరీ, డిజైన్, కొంగులో నాజూకుతనం అలాగే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment