క్రీడలతో ఉజ్వల భవిత
తిరుపతి మంగళం : క్రీడలతో మానసిక అభివృద్ధితోపాటు ఉజ్వల భవిత ఉంటుందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. ఆదివారం మంగళం పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగళం ట్రెండ్స్‌లో 68వ బేస్ బాల్ అండర్ 14 కాంపిటిషన్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి 13 జిల్లాల నుంచి విద్యార్థులు, పీఈటీలు, పీడీలు పాల్గొన్నారు. గతంలో కంటే భిన్నంగా క్రీడల ప్రోత్సాహకానికి శ్రీకారం చుట్టామని రవినాయుడు తెలిపారు రాబోయే ఒలింపిక్స్‌కు మన తెలుగు ఆణిముత్యాలను అంతర్జాతీయ వేదికపైకి పంపడానికి ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నట్టు తెలిపారు. అమిగోస్ బిల్డర్స్ ఎండీ అనిత్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి జరిగే ఒలింపిక్స్‌లో దేశానికి బంగారు పతకం రావాలని కోరుకుంటున్నానన్నారు. ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ, ఎస్‌ఎంసీ చైర్మన్ షేక్ భాను, పోటీల కార్యనిర్వాహక కార్యదర్శులు బాబు, రామకృష్ణ, ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి, హెచ్‌ఎం కేశవులునాయుడు, సాంఘిక ఉపాధ్యాయులు కృష్ణమనాయుడు, ఉత్తమ పీఈటీ అవార్డు గ్రహీత ప్రభాకర్, పూర్ణచంద్ర, టిడిపి నాయకులు ఈశ్వరయ్య, తెలుగు యువత అధ్యక్షులు జ్యోతికృష్ణ, జనార్ధన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment