జర్నలిస్టులకు క్రికెట్ పోటీలు
తిరుపతి సిటీ : తిరుపతి అగ్రికల్చరల్ కళాశాల మైదానంలో ఆదివారం రాష్ట్రస్థాయి జర్నలిస్ట్‌ల క్రికెట్ టోర్నమెంట్‌ను ఎస్పీ సుబ్బరాయుడు ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ నిత్యం వార్తల సేకరణలో బిజీగా ఉండే పాత్రికేయులు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కోసం తరచూ క్రీడాపోటీల్లో పాల్గొనాలని సూచించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జట్లు ఫైనల్‌కు చేరాయి. ఈ మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర జట్టు విజయం సాధించి శ్రీవారి కప్‌ను కై వసం చేసుకుని చాంపియన్‌గా నిలిచింది. క్రీడల ముగింపు కార్యక్రమానికి ఆర్థోపెడిక్ డాక్టర్ సుకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సాయి సుధా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నేతలు బొల్ల సతీష్, ఓబులం ప్రసాద్, వేణుగోపాలరావు, తలారి రెడ్డప్ప, తలారి నాగలింగస్వామి, సౌపాటి ప్రకాష్, సురేంద్ర, అబ్దుల్ బాయ్, అజయ్ ఇండియన్, నాగవర్ధన్, విజయ్, జగదీష్, పద్మనాభంపాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment