అక్రమ మద్యం విక్రేతలపై కేసు
తిరుపతి క్రైమ్: తిరుపతిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ రామచంద్ర తెలిపారు. ఆదివారం ఉమ్మడి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో సంయుక్తంగా కలిసి దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. తిరుపతి టౌన్ క్లబ్ సమీపంలోని ఇందిరా నగర్లో గణేష్ అనే వ్యక్తి వద్ద ఆర్మీకి సంబంధించిన 13 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. అలాగే రైల్వే స్టేషన్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న కలకడకు చెందిన వ్యక్తి నుంచి 10 సీసాలు పట్టుబడ్డాయని వివరించారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ వైవీ పవన్ కుమార్, ఎస్‌ఐలు పృథ్వీ, జయశంకర్, మహేష్, హరికృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment