పనపాకంలో విషాదం
చంద్రగిరి : మండలంలోని పనపాకం పంచాయతీలో ఘోరం జరిగింది. మూడేళ్ల బాలుడు కాలువలో పడి మృతి చెందడంతో స్థానిక పాతపేటలో విషాధఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. చంద్రగిరి మండలం పనపాకం గ్రామానికి చెందిన లోకేష్ ఆచారి అలియాస్ సిద్ధయ్య, శరణ్య దంపతులకు ముగ్గురు సంతానం. బుధవారం తై అమావాస్య సందర్భంగా సిద్ధయ్య ఆచారి తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇంటి వద్ద అన్నయ్యతో కలిసి తేజ(3) ఆడుకుంటున్నారు. తల్లి శరణ్య ఇంటి పనిలో నిమగ్నమైంది. ఇంతలో నాన్న వద్దకు వెళ్లేందుకు అన్న బయలుదేరడంతో తేజ కూడా అనుసరించాడు. మార్గం మధ్యలోని స్వర్ణముఖి నది కాలువను దాటే క్రమంలో కొట్టుకుపోయాడు. ఈ విషయం ఎవరూ గుర్తించలేదు. ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడు కనిపించకపోయేసరికి కుటుంబీకులు ఆందోళన చెందారు. అంతకుముందే ఓ గుర్తు తెలియని పాత సామాన్ల వాహనం రావడంతో, బాలుడిని వారు అపహరించుకెళ్లినట్లు అనుమానించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలో కాలువలోని చెట్ల పొదల్లో తేజ మృతదేహం గుర్తించి వెలికితీశారు. కుమారుడి మృతదేహం చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లి శరణ్యను ఓదార్చడం నిస్తేజంగా కూర్చోవడం చూపరులను కలచివేసింది.
● కాలువలో పడి మూడేళ్ల బాలుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment