ఉరేసుకొని మహిళ ఆత్మహత్య
పరిగి: వ్యక్తిగత కారణాలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గడిసింగాపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సండ్రపు జయమ్మ(41) భర్త వెంకటయ్య 15 ఏళ్ల క్రితం మృతి చెందడంతో కుమారుడి కలిసి ఉంటుంది. రెండేళ్లుగా పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిన స్వీపర్‌గా పనిచేస్తుంది. బుధవారం రాత్రి పరిగి నుంచి వచ్చి ఇంట్లో ఒంటరిగా నిద్రించింది. కుమారుడు అభిలాష్ బంధువుల దగ్గరకు వెళ్లి గురువారం ఉదయం ఇంటికి వచ్చి తల్లిని పిలవగా.. ఉలుకుపలుకు లేదు. దీంతో చుట్టుపక్కల వాళ్లు సహాయంతో ఇంటిపై ఉన్న బండను తీసి చూడగా దూలానికి చీరతో ఉరి వేసుకుని మృతి చెందింది. జయమ్మ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ మృతురాలి సోదరుడు సత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
నేడు డయల్ యువర్ డీఎం
షాద్‌నగర్‌రూరల్: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు షాద్‌నగర్ డిపో మేనేజర్ ఉష గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment