ఫార్మాకు భూములివ్వం
● తేల్చి చెప్పిన రైతులు
● తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన
దుద్యాల్: ఫార్మాసిటీ ఏర్పాటు కోసం బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని బాధిత రైతులు హెచ్చరించారు. అలాగే ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు నిర్వహించే సమావేశాలను బహిష్కరిస్తామని తెలిపారు. గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలంలోని లగచెర్ల, పోలేపల్లి, హకీంపేట్, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాకు చెందిన రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామాల పరిధిలో 1,375 ఎకరాల్లో ప్రభుత్వం ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సిద్ధమవుతోందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని నెలలుగా ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. అనంతరం అధికారులకు వినతిప త్రం అందజేశారు. స్పందించిన ఉప తహసీల్దార్ బలవంతంగా భూము లు తీసుకోమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment