రైతులకు ఇబ్బంది కలగొద్దు
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్
కుల్కచర్ల: రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. గురువారం కుల్కచర్లలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వరాదన్నారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, కుల్కచర్ల పీఏసీఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, తహసీల్దార్ మురళీధర్, ఎంపీడీఓ రామకృష్ణ, ఏపీఎం శోభ, ఇన్చార్జ్ ఎంపీఓ భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనందం, మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య, జిల్లా రజక సంఘం ప్రధాన కార్యదర్శి మోత్కూరు వెంకటేష్, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment