మళ్లీ మొండి ‘చేయి’!
మహేశ్వరం: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నిక కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాల రాజేసింది. మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయింది. దీంతో మహేశ్వరం, కందుకూరు ఎస్టీ నేతలు చైర్మన్ కుర్చీ దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాడిన నాటి నుంచి ఇప్పటి వరకు మూడు పర్యాయాలు కందుకూరు మండలానికి చెందిన వారే చైర్మన్‌గా ఉన్నారు. ఈ సారి మహేశ్వరం మండల వాసికి చైర్మన్ పదవి కట్టబెట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్‌ఆర్ మరో మారు కందుకూరు మండలానికి చెందిన వారికే ఇచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ మేరకు చైర్మన్‌గా సభావత్ కృష్ణా నాయక్, వైస్ చైర్మన్‌గా జి.అంజయ్య ముదిరాజ్ పేరును ప్రతిపాదిస్తూ ఆదివారం మార్కెట్ కమిటీ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. విషయం తెలుసుకున్న మహేశ్వరం మండలానికి గిరిజన నేతలు కేఎల్లార్‌పై అసంతృప్తితో రగిలిపోతున్నారు. కేఎల్లార్ తమను నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పటిష్టానికి బీఆర్‌ఎస్ నేతల అక్రమ కేసులకు బెదరకుండా పనిచేసినా తమను విస్మరించడం సరికాదంటున్నారు. ఏక పక్షంగా ఎంపిక చేయడం తగదంటున్నారు. ఈ మేరకు కేఎల్‌ఆర్ తీరును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు మహేశ్వరం హస్తం శ్రేణులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా కేఎల్‌ఆర్ పునరాలోచించి మహేశ్వరం మండలానికి చెందిన గిరిజన నేతలకు ఏఎంసీ చైర్మన్ పదవి కట్టబెట్టి మాట నిలబెట్టుకోవాలని లేదంటే పార్టీకి తీవ్ర నష్టం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మహేశ్వరం మండలం హస్తం శ్రేణుల్లో అసంతృప్తి జ్వాలలు
ఏఎంసీ చైర్మన్ పదవి మళ్లీ కందుకూరు మండలానికే..
కేఎల్‌ఆర్ తీరుపై గిరిజన నేతల గుర్రు
Comments
Please login to add a commentAdd a comment