విజయోత్సవాలను సక్సెస్ చేద్దాం
అనంతగిరి: ప్రజాపాలన విజయోత్సవాలను సక్సెస్ చేద్దామని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లాలో ఈ నెల 19 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కొడంగల్‌లో రెండు రోజులపాటు..
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై కళాయాత్ర బృందం ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల, అంతడుపుల నాగరాజు రాష్ట్రమంతా పర్యటిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 6గంటలకు కొడంగల్‌లోని రాఘవేంద్ర గార్డెన్లో ప్రజా విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 7న అంతడుపుల నాగరాజు బృందంచే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా విచేస్తారని తెలిపారు. అదేవిధంగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి తోపాటు శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.
నేటి ప్రజావాణి రద్దు
గ్రూప్ –3 పరీక్షల నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు
కలెక్టర్ ప్రతీక్‌జైన్
Comments
Please login to add a commentAdd a comment