● బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రా రెడ్డి
తుర్కయంజాల్: రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపాడని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రామ చంద్రారెడ్డి విమర్శించారు. మన్నెగూడలోని వేద కన్వెన్షన్ హాల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని.. 11 నెలలు గడుస్తున్నా ఏ ఒక్కటీ నెరవేర్చలేదని అన్నారు. హామీల అమలు గురించి బీజేపీ ప్రశ్నిస్తుండటంతో సీఎం హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని దుయ్యబట్టారు. తాజాగా లగచర్ల ఘటన కూడా ఇందులో భాగమేనని అన్నారు. ఇటీవల బీజేపీకి చెందిన 20 మంది నాయకులు మూసీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలతో కలి సి నిద్ర చేశామని.. స్వయంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ ప్రాంత ప్రజలతో చర్చింకుండానే ఏకపక్షంగా మూసీ పునరుజ్జీవం పేరిట పేదల ఇళ్లను కూలగొట్టే కార్యక్రమానికి తెరలేపారని మండిపడ్డారు. 1000 అడుగుల విస్తీర్ణంలో ఉన్న మూసీ నదిలో 300 ఫీట్ల వెడల్పుతో రిటైనింగ్ వాల్ కట్టి సమస్యకుపరిష్కారం చూపొచ్చని, మిగిలిన దాంట్లో బ్యూటిఫికేషన్ వంటి పనులు చేపట్టుకోవచ్చని సూచించారు. గంగా నది ప్రక్షాళనకు రూ. 38 వేల కోట్లను ఖర్చు చేశారని కేవలం 52 కిలోమీటర్ల మూసీ నది కోసం రూ.1.50 లక్షల కో ట్లు ఎలా అవుతుందని నిలదీశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీకి మూటలను పంపించేందుకే ఈ వ్యవహారం అని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్‌లు, జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా చేపడుతోందని అభిప్రా యం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కాంగ్రెస్ నా యకులు విమర్శలు మానుకుని, క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవాలని హితవు ప లికారు. నాయకులు రాణి రుద్రమ, బండారు విజయలక్ష్మి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment