బ్రాహ్మణ సమాఖ్య పాలమూరు జిల్లా అధ్యక్షుడు జోషి గోపాలశర్మ
షాద్‌నగర్: బ్రాహ్మణులు చదువుతోపాటుగా వేదాలు నేర్చుకోవాలని బ్రాహ్మణ సమాఖ్య పాలమూరు జిల్లా అధ్యక్షుడు జోషి గోపాల శర్మ అన్నారు. ఆదివారం షాద్‌నగర్ బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో పట్టణంలోని పరిగి రోడ్డులో సంతోష్‌కుమార్ తోటలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. బ్రాహ్మణులందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. తద్వారా సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చని అన్నారు. వేదాలు నేర్చుకోవడానికి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కంచి కామకోటి పీఠాధిపతులు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత బ్రాహ్మణులపై ఉందని అన్నారు. కార్యక్రమంలో సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మంగు రాఘవరావు, సభ్యులు ఎంకే రాజేంద్రప్రసాద్, రామ సత్యనారాయణ, సంబురాజు రవిశర్మ, స్వరూప్ సిద్ధాంతి, ప్రవీణ్, మహేష్‌శర్మ, భానుశర్మ, కృష్ణ శర్మ, రఘునాథ్‌శర్మ, శ్రీమతమ్మ, గిరిజ, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
వనభోజన మహోత్సవం
పట్టణంలోని ప్రశాంత్‌నగర్, సుభాష్‌నగర్ కాలనీ వాసులు ఆదివారం కాలనీలోని పార్కులో వనభోజన మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఈశ్వర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment