మా గ్రామాన్ని మున్సిపల్‌లో కలపొద్దు
చేవెళ్ల: కొత్తగా ఏర్పాటు చేయబోయే చేవెళ్ల మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని కలుపొద్దని దేవునిఎర్రవల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే కాలె యాదయ్యకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. చేవెళ్ల మున్సిపాలిటీగా మార్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే తమ గ్రామాన్ని మాత్రం కలప వద్దన్నారు. మండల కేంద్రానికి తమ గ్రామం దూరంగా ఉండటంతోపాటు ఎక్కువ మంది రైతులు, పేదలు ఉన్నారని చెప్పారు. వీటిని దృష్టిలో ఉంచుకొని తమ గ్రామాన్ని మున్సిపల్‌కు మినహాహించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రంగారెడ్డి, బక్కయ్య, జంగయ్య, శ్రీనివాస్, రాజు, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్యకు దేవునిఎర్రవల్లి గ్రామస్తుల వినతి
Comments
Please login to add a commentAdd a comment