వికారాబాద్: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్‌ను న్యాయస్థానం మరో 14 రోజు లు పొడిగించింది. లగచర్ల ఘటనలో ఏ–1 నిందితుడిగా ఉన్న ఆయనను ఈనెల 13న అదుపులోకి తీసుకున్న పోలీసులు 14న కొడంగల్ కోర్టులో హాజరుపర్చగా 14రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నరేందర్‌రెడ్డి రిమాండ్ గడువు బుధవారం ముగిసింది. దీంతో న్యాయస్థానం మరోసారి ఈ కేసును విచారించింది. వాదన లు విన్న అనంతరం నరేందర్‌రెడ్డి రిమాండ్‌ను డిసెంబర్ 11వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. ఇదిలా ఉండగా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయనను స్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా బుధవారం కోర్టులో వాదనలు జరగగా.. వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడింది. నరేందర్‌రెడ్డి బెయిల్ కోసం వికారాబాద్ జిల్లా కోర్టులో వేసిన పిటిషన్‌పై వాదనలు జరగగా తీర్పును గురువారానికి వాయిదా వేశారు. మరోవైపు లగచర్ల దాడి ఘటనలో 71 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు 29మందిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఇందులో కొందరు చర్లపల్లి జైలులో, మరి కొందరు సంగారెడ్డి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
డిసెంబర్ 11వరకు పొడిగిస్తున్నట్లు కొడంగల్ కోర్టు వెల్లడి
బెయిల్ పిటిషన్‌పై తీర్పును నేటికి వాయిదా వేసిన జిల్లా కోర్టు
Comments
Please login to add a commentAdd a comment