సమస్యలు పరిష్కరిస్తా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి టీఎస
9లోu
సర్వేపై ప్రత్యేక దృష్టి సారించాలి
కలెక్టర్ ప్రతీక్ జైన్
బొంరాస్‌పేట: ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు. వివరాల నమోదులో ఎలాంటి తప్పుడు ఉండరాదని సిబ్బందికి సూచించారు. అనంతరం బొంరాస్‌పేట, మెట్లకుంట, బురాన్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, తుంకిమెట్లలో సన్నరకం వరి ధాన్యం కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం సేకరణ, నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడారు. వసతులపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చి న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. సన్నరకం వడ్లకు సంబంధించిన బోనస్ డబ్బు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.
పాఠశాల సందర్శన
మండలంలోని తుంకిమెట్ల ప్రాథమిక పాఠశాలను బుధవారం కలెక్టర్ ప్రతీక్‌జైన్ సందర్శించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి రోజు భోజనం ఇలాగే ఉండాలని సిబ్బందికి సూచించారు.
వైద్య శిబిరాలు నిర్వహించండి
అనంతగిరి: ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరవణతో మాట్లాడారు. సీజనల్ వ్యాధులపై పాఠశాలల సిబ్బందికి, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. దగ్గు, జలుబు, జ్వరం మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరవణ, ఉప వైద్యాధికారి జీవరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment