డయల్ 100 కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలి
అనంతగిరి: డయల్ 100కు వచ్చే కాల్స్‌పై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వరాదని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. పీఎస్‌ల వారీగా పెండింగ్ కేసులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారు డయల్ 100కు కాల్స్ చేస్తారని తక్షణం స్పందించి సాయం అందించేందుకు కృషి చేయాలని సూచించారు. అప్పుడే పోలీసు శాఖపై నమ్మకం పెరుగుతుందని తెలిపారు. కేసులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సీసీ టీవీలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీసు వాహనాలను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించి మంచి కండీషన్‌లో పెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఎస్పీ నారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment