హక్కులు సాధించే వరకు పోరాడుతాం
బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణ
అనంతగిరి: ఆశ వర్కర్లు శాంతియుతంగా చేస్తున్న పోరాటాన్ని అణచివేయడం తగదని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, తెలంగాణ గ్రామీణ ఆరోగ్య ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు మంజుల, ప్రధాన కార్యదర్శి కోటపల్లి అనిత అన్నారు. మంగళవారం బీఆర్టీయూ అనుంబంధ సంఘమైన ఆశ వర్కర్ యూనియన్ నాయకులను తెల్లవారుజామునుంచే అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ చేసినా మా హక్కులు సాధించేవరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్‌ల పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment