మైనింగ్ భూములను గుర్తించండి
తాండూరు రూరల్: పట్టా భూముల్లో మైనింగ్, మట్టి తవ్వకాలు చేపట్టిన ప్రదేశాలను గుర్తించి భూముల వివరాలను సేకరించాలని తాండూరు సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మండల పరిధిలోని మల్కాపూర్ నాపరాతి గనుల్లో రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. మండల పరిధిలోని ఓగిపూర్, కరన్‌కోట్, మల్కాపూర్, సంగెంకలాన్, కోటబాసుపల్లి గ్రామాల్లో వందల ఎకరాల్లో నాపరాతి గనులున్నాయన్నారు. మైనింగ్ శాఖ నుంచి లీజుదారుల జాబితా తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. సాగు యోగ్యంకాని భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇవ్వొద్దని అన్నారు. మండల వ్యాప్తంగా ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాగు యోగ్యంకాని భూముల వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఈ నెల 20వరకు సర్వే పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్, వ్యవసాయ శాఖ ఏఓ కొమురయ్య, ఏఈఓలు శ్రీను, శివకుమార్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
సాగుకుయోగ్యం కాని భూములను గుర్తించేందుకు ఐదు ప్రత్యేక బృందాలు
తాండూరు సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment